రాష్ట్రీయం

సింగరేణిలో ‘కారుణ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ, ఉద్యోగ నిర్వహణ చేపట్టలేమన్న సింగరేణి కార్మికులకు సంబంధిత యాజమాన్యం కారుణ్య నియమాకాలతో ఆయా కుటుంబాల్లో వారసులకు ఉద్యోగ భద్రత చేపట్టబోతోంది. తాము అనారోగ్యాలతో పని భారాన్ని మోయలేమని విన్నవించుకున్న కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి చెప్పింది సరైనదేనన్న నిర్ధారణ జరిగితే, వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను అందివ్వనున్నది. సింగరేణిలో దాదాపు 1,921 మంది కార్మికులు ధరఖాస్తు చేసుకోగా అందులో 1,344 మందిని అన్‌ఫిట్‌గా గుర్తించామని యాజమాన్యం వెల్లడించింది. మరో 227 మంది కార్మిక కుటుంబాలకు అవకాశం ఇస్తామని సంస్థ సీఎండీ శ్రీ్ధర్
తెలిపారు. ఆగస్టు ఒకటవ తేదీన 40 మంది కార్మిక కుటుంబాల వారసులకు నియామట పత్రాలను అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సింగరేణి ఏరియాలో పర్యటించింనప్పుడు కార్మిక కుటుంబాలు చేసుకున్న విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని నియామక పత్రాలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. గతంలో వారసులకు ఉద్యోగాలిడంలో జాప్యం జరిగేదని కార్మిక కుటుంబాలు అంటున్నాయి. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 10 మార్లు వివిధ వైద్య పరీక్షలు జరిగాయన్నాని వారు అన్నారు. కారుణ్య నియామకాల్లో ఎలాంటి అపోహలు, పైరవీలకు అవకాశం లేదని అన్నారు. రాబోవు రోజుల్లో కూడా కారుణ్య నియమకాలకు ధరఖాస్తు చేసుకోవడానికి వీలుకల్గుతుందని సంస్థ పౌరసంబంధాల అధికారి మహేష్ తెలిపారు.