రాష్ట్రీయం

ఏపీలో ఐదు ‘సైబరాబాద్’లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: రాష్ట్రంలో ఐటీ రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు వీలుగా సైబరాబాద్ తరహా నగరాలను ఐదింటిని నిర్మించనున్నట్టు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద ఏపీఎన్నార్టీకి చెందిన ఇన్ఫోసైట్ భవనంలో 10 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ రంగాన్నిఅభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్ రంగంలో రెండు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇప్పటివరకూ ఐటీ రంగంలో 36వేలు, ఎలక్ట్రానిక్స్ రంగంలో 20వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. పెద్ద కంపెనీలనే కాకుండా చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలపై కూడా దృష్టి సారించామని, ఇందుకు అనుగుణంగానే రాయితీలను ఇస్తున్నామన్నారు. తిరుపతిలో జియో కంపెనీ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టుకు 125 ఎకరాల స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరలోనే ఒప్పందం చేసుకోనున్నామని వెల్లడించారు. అమరావతి సహా విశాఖ, చిత్తూరు, అనంతపురం, గోదావరి జిల్లాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్నార్టీ అధ్యక్షుడు వేమూరి రవి తదితరులు పాల్గొన్నారు.