రాష్ట్రీయం

కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటమే తక్షణ కార్తవ్యమని, గ్రామస్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు నిర్వహించాలని, రాష్ట్రంలోని మొత్తం 44వేల పోలింగ్ కేంద్రాలకు కమిటీలు ఏర్పాటు చేసి పూర్వవైభవం తేవాలని బుధవారం నాడిక్కడ ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ఊమెన్ చాందీ, రఘువీరారెడ్డి, తదితరులు సమావేశ వివరాలను విలేఖరులకు వెల్లడించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలకు భరోసా ఇస్తూ ఇటీవల సీడబ్ల్ల్యూసీలో తీర్మా నం చేయడంపై సమావేశం సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపింది. ప్రత్యేకహోదా కోరుతూ ఆత్మహత్యకి పాల్పడిన మదనపల్లికి చెందిన సుధాకర్, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎంపీ కమ్ముల బాలసుబ్బారావు అకాల మృతికి సంతాపం తెలిపింది. ఈనెల మూడోవారంలో కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి ఈనెల 10లోపు మండల కమిటీలు, శాసనసభ నియోజకవర్గ సమన్వయ కమిటీలు, 11 నుండి 20 లోపు జిల్లా కేంద్రాల్లో శిక్షణ తరగతులు, 21 నుంచి సెప్టెంబర్ 15లోపు 44వేల పోలింగ్ కేంద్రాలకు కమిటీలు, గ్రామపంచాయతీ స్థాయిలో అధ్యక్షుల నియామకాలు, 16 నుంచి 25 వరకు బూత్ కమిటీలకి నియోజకవర్గాల స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. అక్టోబర్ 2 నుంచి 28 వరకు 3మళ్లీ కాంగ్రెస్2 పేరుతో ఇంటింటికీ కాంగ్రెస్, ఇంటికో రూపాయి సేకరణ, అక్టోబర్ 31 నుంచి నవంబర్ 19 వరకు 3ఇందిరమ్మ రా జ్యం - ఇంటింటా సౌభాగ్యం పేరుతో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తూ సోనియా, రాహుల్ గాంధీలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలని, ప్రతి నేత, ప్రతి కార్యకర్త నుంచి ఒకరోజు ఆదాయాన్ని విరాళంగా సేకరించాలని, ఇక నుంచి పూలమాలలు, శాలువాలకు ఖర్చు చేయకుండా ఆ సొమ్మును పార్టీకి విరాళంగా ఇవ్వాలని ఊమెన్ చాందీ సూచించారు.
సీడబ్ల్యుసీ సమావేశంలో వివిధ అంశాలపై చేసిన తీర్మానాలను ప్రజలకు అర్థమయ్యే భాషలో కరపత్రాలు ప్రచురించాలని నిర్ణయించారు. ఏపీకి విభజన హామీలు అమలు చేశామంటూ ఎన్డీఏ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అబద్ధపు అఫిడవిట్ దాఖలు చేయడాన్ని ద్రోహంగా పరిగణిస్తూ సమావేశం తీర్మానం చేసింది. విభజన హామీల అమలుపై సుప్రీం కోర్టు కేసులో ఇంప్లీడ్ అయిన ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజును సమావేశం అభినందించింది. బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు వర్తింప చేయాలనేది కాంగ్రెస్ పార్టీ విధానమని ఊమెన్ చాందీ పునరుద్ఘాటించారు. ఇందుకోసం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌ను సవరించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆయన వివరించారు. ఉత్సాహంగా జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శులు సీడీ మెయ్యప్పన్, క్రిస్ట్ఫోర్ తిలక్, ఇటీవల పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, కిల్లి కృపారాణి, సీనియర్ నేతలు, రాష్ట్ర మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, కనుమూరి బాపిరాజు, ఎస్ శైలజానాథ్, కొండ్రు మురళి, నాదెండ్ల మనోహర్, సీ రామచంద్రయ్య, డాక్టర్ తులసిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల చైర్మన్‌లు సహా మొత్తం 130 మంది హాజరయ్యారు.