రాష్ట్రీయం

యూ టర్న్ కాదు.. రైట్ టర్నే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 1: ‘రాష్ట్భ్రావృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్రంలో ఎన్‌డీఏతో కలిసి ఉన్నాం.. అయితే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని తెలిశాక బయటకు వచ్చాం.. దీంతో నాది యూ టర్న్ అంటున్నారు.. నాది యూ టర్న్ కాదు.. రైట్ టర్నే.. మీకు మందబలం (మెజారిటీ) ఉండవచ్చు.. మాకు మొరాలిటీ (నిజాయితీ) ఉంది.. ప్రత్యేక హోదా, విభజన హక్కులు, ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతాం.. అంతిమ విజయం మాదే..’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు గ్రామంలో బుధవారం జరిగిన పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. అప్పర్ పెన్నార్ రిజర్వాయర్‌కు హంద్రీనీవా జలాలు తరలించేందుకు చేపట్టనున్న కాలువ, రెండు చిన్న రిజర్వాయర్ల పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. అక్కడ నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలోని ప్రభుత్వాన్ని మార్చి అయినా సరే హక్కులు సాధించుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి అండగా నిలిస్తే కొండనైనా ఢీకొట్టే సత్తా ఉందని అన్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే, మీకు సన్మానం చేస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటు సాక్షిగా బెదిరించారన్నారు. మేం ఆంధ్రులం.. మీ బెదిరింపులకు భయపడం.. పోరాడుతాం.. అంటూ ముఖ్యమంత్రి కేంద్రాన్ని హెచ్చరించారు. రాజకీయాల్లో తానే సీనియర్ అని, మోదీ కన్నా ముందే ముఖ్యమంత్రినయ్యానని అన్నారు. ఏదైనా పోరాటాలు చేయాల్సి వస్తే తనను మించి ఎవరూ పోరాడలేరన్నారు. బీజేపీని నమ్ముకున్న పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అని బాబు అన్నారు. కేసుల భయంతోనే వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రానికి, ఢిల్లీకి ఊడిగం చేస్తోందన్నారు. వీళ్లా నీతు లు మాట్లాడేది అంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీఎంలలో డబ్బు రాదు.. మన డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుల్లో ఇబ్బందులు.. అందుకు కారణం మోదీయేనని చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తూ అవినీతిని ప్రక్షాళన చేస్తామని, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం మూలుగుతోందని, దాన్ని బయటకు తీస్తామని, అక్రమార్కులపై కేసులు పెడమని, ఒక్కొక్కరి ఖాతాకు రూ.15 లక్షలు జమచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. మరి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు మీకు కనిపించలేదా.. ఏ-1, ఏ-2లను కూర్చోబెట్టుకుని అవినీతిని ఎలా ప్రక్షాళిస్తారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైల్వేజోన్ ఇస్తామని పార్లమెంటులో ప్రకటించి, ఇవ్వలేమంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తారని, ఇదేనా మీ నిజాయితీ అని అన్నారు. ఈ విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన అడ్రస్ లేవని, వీరి వెనుక వెళ్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు ఉంటుందని తనకు తెలుసునన్నారు. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తనకు బాగా తెలుసని అన్నారు. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకుంటామని, కేంద్రం సహకరించకపోతే తామే ఏర్పాటు చేసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి జీవనాడి పోలవరం అని, కేంద్రం సహకరించకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆపేది లేదన్నారు. పోలవరాన్ని కట్టి తీరుతాం అని కేంద్రానికి సవాల్ విసిరారు. హైదరాబాదులో ఉండేందుకే తాను అభివృద్ధి చేశానని ప్రధాని మోదీ తనను విమర్శిస్తున్నారని, తనకు పరిపక్వత లేదంటున్నారని, అక్కడికేదో ఆయనకున్నట్లు, హూందాతనాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తానేదో బీజేపీ ట్రాప్‌లో పడ్డానంటున్నారని, కానీ వైఎస్‌ఆర్‌సీపీ కుడితితో పడింది బీజేపీనేనన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పూటకో మాట మాట్లాడుతోందని, కాపుల రిజర్వేషన్లపై నోరు జారి తోక ముడిచిందని ఎద్దేవా చేశారు. తన పిలుపునకు స్పందించి కర్నాటకలో ప్రజలు బీజేపీని ఓడించారని గుర్తుచేశారు. 9 నెలల్లో పేరూరు ప్రాజెక్టు కాలువ పూర్తి చేస్తామని, హంద్రీ నీవా ద్వారా కృష్ణాజలాలు తరలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటులో భాగంగా అనంతపురంలో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు.
2 వేల జనాభాకన్నా తక్కువ ఉన్న గ్రామాల్లో సోప్‌పిట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. 2 వేలకు మించి జనాభా ఉన్న చోట సీనరేజ్ ప్లాంట్లు, 5 వేల జనాభా ఉంటే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, చీఫ్ విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ కేశవ తదితరులు పాల్గొన్నారు.