రాష్ట్రీయం

కల్పతరువుల్లా ప్రాజెక్టుల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్రంలో జరుగుతున్న నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వాన్ని నడుపుతున్నవ వారికి కల్పతరువులా, కాంట్రాక్టర్లకు కామధేనువులా మారాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చంధ్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ట్రస్ట్భ్‌వన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జలయజ్ఞం ధన యజ్ఞంగా మారిందని ఉద్యమం చేసిన నాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చాక చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రతీ ఒక్క ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయాన్ని రెట్టింపు చేస్తున్నారని మండిపడ్డారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అంచనా వ్యాయాన్ని పెంచుతూ జీఓ నెంబర్-72 ప్రభుత్వం గురువారం విడుదల చేసిందన్నారు. మొదట దీని వ్యయం రూ. 7,926 కోట్లు కాగా ప్రస్తుతం రూ.13,057 కోట్లకు పెంచడం ఏమిటని నిలదీశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో గాని, అంచనాలు పెంచడంలో గాని ఎలాంటి శాస్ర్తియతా పాటించకుండా ప్రజా ధనాన్ని వృదా చేస్తున్నారన్నారు. ఇదే తరహాలో శ్రీరాం సాగర్ వరద కాలువ అంచనా వ్యయం ఒక్కసారిగా రూ.9,886 కోట్లకు పెంచారని దుయ్యబట్టారు. వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచడం వెనుక కారణమేమిటనే విషయాన్ని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

మా మద్దతుతో 160 ఓట్లతో గెలిచారు...
సింహం సింగిల్‌గా వస్తుందని ఇటీవల మంత్రి కేటీఆర్ అనడంపై రావుల సీరియస్‌గా స్పందించారు. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో కలిసి మహాకూటమి, 2014లో ఎంఐఎం పార్టీతో మిత్ర పక్షంగా ఉన్న విషయాన్ని కేటీ ఆర్ మరిచారని అన్నారు. 2009లో చిన్న సంహం (కేటీఆర్) టీడీపీ మద్దతుతో 160 ఓట్ల మెజారిటీతో గెలిచారని అన్నారు.