రాష్ట్రీయం

‘నిర్భయ’ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 3: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌పై పోలీసు కేసు నమోదైంది. శాంకరీ నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినులు శుక్రవారం సీ.పీని కలిసిన మీదట రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్ నాల్గవ టౌన్ పోలీసులు సంజయ్‌పై నిర్భయ చట్టంతో పాటు ఐపీసీ 354, 354 (ఎ), 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సంజయ్‌ను అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి వెళ్లగా, అప్పటికే సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛ్ఫాలో పెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో విలేఖరుల సమావేశంలో పాల్గొన్న అనంతరం సంజయ్ హైదరాబాద్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. తనపై పోలీసులు కేసు నమోదు చేశారనే సమాచారం తెలిసిన వెంటనే హైదరాబాద్‌లో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు భావిస్తున్నారు. దీంతో అతని కోసం పోలీసు అధికారులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపులు చేపడుతున్నారు. బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు సంజయ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేస్తూ అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగడం చర్చనీయాంశమవుతోంది.