రాష్ట్రీయం

సమన్వయకర్తలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలకు మధ్య సమన్వయకర్తలే కీలకమని, ఈ దిశగా వారు కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ విజయమే లక్ష్యంగా సమన్వయకర్తలు పని చేయాలని, పది రోజుల్లో పోలింగ్ కేంద్రాలకు కమిటీలను పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నియోజకవర్గ సమన్వయకర్తలు, డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సలీం, శ్రీనివాస్ కృష్ణన్‌తో పాటు శక్తి ఆప్ ఇన్‌ఛార్జీ, ఎమ్మెల్యే టి. రాంమోహన్ రెడ్డి, ఏఐసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ ప్రసాద్, గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సీజే శ్రీనివాస్, తన్నీరు నరేందర్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉత్తమ్ ప్రసంగిస్తూ సమన్వయకర్తలు నియోజకవర్గంలో ఇన్‌ఛార్జీలు కారని, వారు నాయకులు, కార్యకర్తల మధ్య వారధులుగా వ్యవహరించి, వారిని ఒకే తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తారని అన్నారు. నియోజకవర్గంలో శక్తి ఆప్ నమోదును పెద్ద ఎత్తున చేయించాలని వారిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల కమిటీ నుంచి నియోజకవర్గాల కమిటీల వరకూ అన్ని కమిటీలనూ పది రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఉంది కాబట్టి ఈలోగా కమిటీల నియామకాలను పూర్తి చేయాలని ఉత్తమ్ సూచించారు. శక్తి ఆప్ వల్ల కార్యకర్తలకు, నాయకులకు మధ్య అవగాహన కలిగేందుకు, వారి కార్యకపాలను అనుసంధానం చేయడానికి వీలవుతుందని అన్నారు. ఆప్ నమోదులో నిర్లక్ష్యం చేయరాదని, పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని తెలిపారు. సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల నియామకం కూడా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కొవాలన్నారు. సమస్యలపై స్థానికంగా చర్చించి ప్రజాఉద్యమాలు చేపట్టాలని హితవు పలికారు. సమన్వయకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల టిక్కెట్ల విషయాలపై చర్చించరాదని హెచ్చరించారు. కుంతియా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్పారు. ఇంకా నియోజకవర్గాల వారీగా పార్టీ సమన్వయకర్తల పని తీరును సమావేశంలో చర్చించారు.