రాష్ట్రీయం

క్వారీలో భారీ పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఆగస్టు 3: కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో క్వారీలో భారీ పేలుడు సంభవించి 10 మందికి కూలీలు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు మంటలు భారీగా ఎగసిపడ్డాయి. మంటల్లో కాలిన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంఘటన ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామ శివారులోని కొండల్లో శుక్రవారం రాత్రి జరిగింది. కంకర కోసం కొండపై ఉన్న బండరాళ్లు పేల్చేందుకు అమర్చిన జెలెటిన్ స్టిక్స్ ఒక్కసారిగా అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల గ్రామాల్లోని ఇళ్లకు బీటలు బారాయి. దీంతో ప్రాణభయంతో జనం ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆలూరు మండలం హత్తిబెగళల్ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని కొండల్లో కంకర కోసం క్వారీ నిర్వహిస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కొండలో బండరాళ్లు పేల్చేందుకు సుమారు 30 మంది కార్మికులు జెలిటిన్ స్టిక్స్ అమర్చారు. అయితే ప్రమాదవశాత్తు అన్నీ ఒకేసారి అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 10 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్లు కాలి కొందరు, కాళ్లూచేతులు కాలి మరికొందరు కొండల్లో చెల్లాచెదురుగా పడిపోయారు. మంటల తీవ్రతకు క్వారీలో కార్మికుల కోసం వేసిన షెడ్లు సైతం తగులబడ్డాయి. క్వారీకి చెందిన లారీ, మూడు ట్రాక్టర్లు తగులబడ్డాయి. భారీ పేలుడు శబ్దం హత్తి బెళగల్, కురవళ్లి, మొలగళ్లి, అగ్రహారం గ్రామాల్లోని వారికి వినిపించింది. భూకంపం వచ్చిందని భావించి అంతా ప్రాణభయంతో ఇళ్లనుంచి పరుగులు తీశారు. పేలుడు తీవ్రతకు ఆయా గ్రామాల్లోని ఇళ్ల గోడలు బీటలువారాయి. అయితే దూరంగా మంటలు రావడంతో క్వారీలో ప్రమాదం జరిగినట్లు తెలుసుకుని అక్కడికి పరుగులు తీశారు. విషయం తెలియగానే ఆలూరుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని ఆసుపత్రికి తరిలించారు. ఈ క్వారీకి ఎలాంటి అనుమతి లేదని తెలుస్తోంది. ఆదోనికి చెందిన శ్రీనివాసచౌదరి ఆధ్వర్యంలో క్వారీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. మృతులంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడంతో వారి పూర్తి వివరాలు తెలియరాలేదు. ఆదోని, ఆలూరు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం మృతులు పెరిగే అవకాశం ఉంది.