రాష్ట్రీయం

బలమైన నాయకత్వాన్ని అణచివేసే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 3: రాష్ట్రాల్లో అశాంతిని ప్రేరేపించి బలమైన నాయకత్వాన్ని అణచివేయడం ద్వారా పెత్తనం చలాయించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ‘ప్రజల సెంటిమెంట్లతో కేంద్రం ఆడుకుంటోంది.. అసోం, జమ్మూ-కాశ్మీర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.అసోంలో 40 లక్షల మంది పేర్లు జాతీయ పౌరసత్వ జాబితాలో లేకపోవటంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి’అని చంద్రబాబు అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇతర పార్టీల మద్దతు కూడగట్టి ఎప్పటికప్పుడు కేంద్రం కుట్రలను ఎండగట్టాలని టీడీపీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీలోని టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు కోరుకున్నది ప్రతనిధులు సాధించాలని, ఇందుకు పార్లమెంటులో ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడాలన్నారు. ఇంత వరకు చేసిన ఉద్యమంపై పజల్లో సంతృప్తి ఉందని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఇకపై కూడా కొన సాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హక్కులు నెరవేర్చాలన్నారు. అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో సమన్వయం చేసుకున్న తరువాతే తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. ధర్మ పోరాటం, గ్రామదర్శిని, జ్ఞానభేరి మూడు కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ ఓ కూడలిలో ఉంది.. కీలకమైన పరివర్తన కాలంలో ఉన్నాం..ఈ దశలో అందరిపై బృహత్తరమైన బాధ్యత ఉంద’ని ఉద్ఘాటించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రోజుకో మాటతో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసహనం, అపరిపక్వత, నాయకత్వ సామర్థలేమి వల్లే వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాడన్నారు. కోట్లు గుమ్మరించి కన్సల్టెన్సీని పెట్టుకున్నా నానాటికీ తీసికట్టు చందంగా వైసీపీ మారిందని వ్యాఖ్యానించారు. నిత్యం జగన్‌లో అసహనం తీవ్రమవుతోందని, కాపు రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలే అతని మానసిక స్థితికి నిదర్శనమని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కాపు కుల స్థితిగతులపై సర్వేకు నిర్దేశించిన దళవాయి సుబ్రహ్మణ్యం కమిటీకి రూ 10లక్షలు చెల్లించేందుకు వాళ్ల నాయనకు (వైఎస్ రాజశేఖరరెడ్డికి) చేతులు రాలేదని, ఇప్పుడు జగన్ మాత్రం రూ 10వేల కోట్లు ఇస్తామంటే ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. మిగిలిన 9 కులాలను బీసీల్లో కలిపి కాపు, బలిజ, ఒంటరి మూడు కులాలను గాలికి వదిలేసింది వైఎస్ కాదా అని ప్రశ్నించారు. వైసీపీ అనుభవ రాహిత్యం అడుగడుగునా ప్రస్ఫుటమవుతోందని అన్నారు. టీడీపీ ఎంపీలు హుందాగా వ్యవహరిస్తూ లక్ష్య సాధనతో రోజుకో అంశంపై పోరాటం చేస్తున్నారని అభినందించారు. కడప ఉక్కు కోసం చేస్తున్న దీక్షల నుంచి రాష్టప్రతి, ఉప రాష్టప్రతిని కలుసుకోవటం వరకు తార్కికంగా వ్యవహరించారని, మిగిలిన 18 అంశాలపై కూడా ఇదే స్ఫూర్తితో ఉద్యమించాలని ఎంపీలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.విశాఖ రైల్వేజోన్, కాకినాడ పెట్రో కాంప్లెక్స్, రాజధానికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు సాయం, అన్ని అంశాలను సాధించే వరకు పట్టుపట్టాలన్నారు. స్థానిక ఎంపీలే ముందుండి నాయకత్వం వహించాలన్నారు. సభను తప్పుదోవ పట్టించే బీజేపీ మంత్రులకు ప్రివిలేజ్ నోటీసులు జారీ చేయటంతో పాటు సుప్రీం కోర్టులో కౌంటర్లు దాఖలు చేయటం వరకు చట్టపరంగా, న్యాయపరంగా అన్ని మార్గాల్లో పోరాటం నిర్వహించాలని ఉద్బోధించారు. ‘ప్రజలు మన వెంటే ఉంటారు.అనుక్షణం మనల్నే గమనిస్తుంటారు.కేంద్రంలో బీజేపీ నేతలు ఓ పద్ధతి లేకుండా రాజకీయ లాభాల కోసం ప్రజల్లో అశాంతిని ప్రేరేపిస్తున్నా’రంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ముస్లిం ఓట్లను తొలగిస్తున్నారని పేర్కొన్న చంద్రబాబు ఈ చర్యను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సమాజంలో అల్పసంఖ్యాక వర్గాలకు అండగా నిలవాలన్నారు. తృణమూల్ కాంగ్రెస్ , ఇతర భావసారూప్యత కలిగిన పార్టీలతో కలసి పనిచేయాలన్నారు. బీజేపీ ఒంటెత్తు పోకడలను ఎదుర్కోవాలన్నారు. ప్రతిపక్షాలు ఏకతాటిపై నిలబడే విధంగా టీడీపీ ఎంపీలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ట్రిపుల్ తలాక్‌పై కూడా ప్రశ్నించాలన్నారు. సున్నితమైన అంశాలపై ఏకపక్షంగా స్పందించరాదని, భావోద్వేగాలను రెచ్చకొడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దేనిపైనైనా చర్చ జరగాల్సిందేనని, ఏకాభిప్రాయంతోనే ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ పార్లమెంటరీ పార్టీనేతలు వైఎస్ చౌదరి, తోట నరసింహం, ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, అవంతి శ్రీనివాస్, మురళీమోహన్, ప్రణాళికామండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.