రాష్ట్రీయం

బీజేపీకి అసలైన సినిమా చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 3: బీజేపీకి 2019 ఎన్నికల్లో అసలైన సినిమా చూపించబోతున్నామని పంచాయితీరాజ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. బీజేపీ, జగన్, పవన్ కలిసి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. నిడదవోలు నియోజకవర్గం పరిధిలోని వేలివెన్ను గ్రామంలో శుక్రవారం ఆయన గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్, పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబును పదేపదే విమర్శిస్తున్నారు తప్ప ఏనాడైనా బీజేపీని విమర్శించారా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీని గెలిపిస్తే దేశ ప్రధాని ఎవరన్నది ముఖ్యమంత్రి చంద్రబాబే నిర్ణయిస్తారని చెప్పారు. బీజేపీ నాయకులు రాయలసీమ డిక్లరేషన్ అని, పవన్‌కళ్యాణ్ ఉత్తరాంధ్ర డిక్లరేషన్ అంటూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. ‘ముఖ్యమంత్రి-యువనేస్తం’ పేరుతో రాష్ట్రంలోని నిరుద్యోగులను ఆదుకోబోతున్నట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి రెండుకళ్ల వంటివని లోకేష్ అన్నారు. బాబు పాలనలో రాష్ట్రం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని ఆయన చెప్పారు. త్వరలోనే ఉభయగోదావరి జిల్లాలకు ఐటీ పరిశ్రమలు తీసుకురానున్నట్లు లోకేష్ వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూడలేక బీజేపీకి కన్నుకుట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి పుట్టిందని, ఈ సమయంలోనే ప్రతి ఒక్కరూ వచ్చి మాయమాటలు చెపుతుంటారని ఆయన హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ తొలుత తణుకులోని కళ్యాణమండపం వద్దకు చేరుకోగా ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, పీతల సుజాత ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి బైక్ ర్యాలీతో లోకేష్ వేలివెన్ను బయలుదేరి వెళ్లారు.