రాష్ట్రీయం

కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఆగస్టు 3: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపులకు రిజర్వేషన్లపై ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు చిత్తూరు జిల్లా కాపు సంఘం వైకాపా నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాపు, బలిజ, ఒంటరి కులాలను బీసీలో చేర్చాలనే డిమాండ్‌కు తాము ఎప్పుడూ సానుకూలమేనని, రాష్ట్రంలోని బీసీలకు ఎటువంటి నష్టం జరగకుండా చేయాలన్నదే తమ అభిమతమన్నారు. నాడు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కచ్చితంగా కాపులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేసి బూటకపుహామీలు ఇచ్చారని, ఎన్నికల తరువాత ఈ హామీలు నెరవేర్చాలని కాపు సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీనివల్ల తునిలో విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటపై వందశాతం కట్టుబడి ఉంటారని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ 50శాతం కన్నా రిజర్వేషన్ మించకుండా కాపులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు.కాపుల రిజర్వేషన్‌కు తాము అడ్డుకామని, మిగిలిన రాష్ట్రాలలో ఉన్న రిజర్వేషన్‌ను స్థితిగతులపై తమ పార్టీ అధ్యయనం చేస్తుందని తెలిపారు. మాట ఇస్తేప్రాణం పోయినా వెనక్కితగ్గే ప్రసక్తేలేదని, వెనక్కితగ్గే అలవాటు, యూ టర్న్ తీసుకునే అలవాటు ఒక చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు.