రాష్ట్రీయం

ఓట్ల కోసమే ‘భృతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఆగస్టు 3: యువత ఓట్లు దండుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగ భృతి ప్రకటన చేశారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు గడిచిన తరువాత నిరుద్యోగ భృతి అంశం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో యువత ఓట్ల కోసమే బాబు ఈ ఎత్తుగడ వేశారన్నారు. నెలకు రూ. వెయ్యి ఇస్తామని ప్రకటించిన బాబు కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులను గుర్తించినట్లు చెప్పడం తగదన్నారు. 2014 నుంచి ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని వారికి ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. నాలుగేళ్లుగా నిరుద్యోగులకు బకాయిపడ్డ భృతి మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతికి వయోపరిమితి 22-35 ఏళ్ల మధ్య అని విధించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే వారికి వయో పరిమితిని ఏ విధంగా నిర్ణయించారో దాన్ని అనుసరించి నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు రూ. 2 వేలు భృతి ఇవ్వాలని సూచించారు. జర్నలిస్టులకు మూడు గదుల ఇళ్ల నిర్మిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం సాధారణ ఇళ్లు కూడా ఇవ్వలేక పోయారన్నారు. నిరుద్యోగ భృతి జర్నలిస్టులకూ వర్తింపచేయాలన్నారు. గతంలో రైతులకు రూ. 84 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించి, రూ. 24 కోట్లు ఇచ్చారని, చివరకు కేవలం రూ. 14 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. రైతులకు మోసం చేసిన విధంగానే నిరుద్యోగులను మోసం చేయవద్దని హితవు పలికారు.