రాష్ట్రీయం

శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 3: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శ్రీలంక ప్రధానమంత్రి రాణిల్ విక్రమ్ సింఘే, సతీమణి ప్రొఫెసర్ మైత్రి విక్రమ్‌సింఘే దంపతులు శుక్రవారం ఉదయం విరామ సమయంలో దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న సింఘే కుటుంబ సభ్యులకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు, అధికారులు ఇస్తికపాల్ స్వాగతం పలికి ఆలయంలోనికి ఆహ్వానించారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ధ్వజస్థంభానికి నమస్కరించిన రంగనాయకమండపం చేరుకున్నారు. అక్కడ వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, జేఈవో శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాను, తన కుటుంబసభ్యులు రెగ్యులర్‌గా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తుంటామన్నారు. ఇప్పుడు భారత పర్యటన కోసం ఏర్పాటు చేయించిన భారతప్రభుత్వానికి తన ప్రోటోకాల్ కోసం ఒక మంత్రిని ఏర్పాటు చేసి కన్నులారా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించిన రాష్ట్రప్రభుత్వం, టీటీడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆరోగ్య పరిస్థితులపై స్టాలిన్, కనిమొళిలతో ఫోన్ ద్వారా గురువారం మాట్లాడానన్నారు. శ్రీలంకభారత్ ప్రభుత్వాల పరస్పర సహకారంతో డీప్‌సీ పిషర్‌మెన్ సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యిందన్నారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో భారతదేశ సభ్యత్వానికి శ్రీలంక దేశం తరపున తాము సానుకూలంగా ఉన్నామన్నారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మైనింగ్ శాఖామంత్రి సుజయకృష్ణా రంగరావు, తిరుమల జే ఈ వో శ్రీనివాసరాజు, ప్రోటోకాల్ అదనపు సెక్రటరీ కల్నల్ అశోక్‌బాబు, డీ ఐ జీ ప్రభాకర్‌రావు, అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, జిల్లా అధికారులు ఉన్నారు. అనంతరం ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి రంగారావు, కలెక్టర్ ప్రద్యుమ్న తదితరులు వీడ్కోలు పలికారు.