రాష్ట్రీయం

తెలంగాణలో పొత్తుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 3: టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తాయని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నామా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నామా.. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కతో కలిసి పాల్గొన్న సభలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమయ్యేందుకు ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహరచన చేస్తున్న నేపథ్యంలో నామా వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌లో ఉన్న వారంతా మాజీ తెలుగుదేశం నేతలేనని, వారు పార్టీకి నష్టం చేకూర్చారని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ నేతలు నూరిపోస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని పరోక్షంగా నామా చెప్పడం, ఆయా గ్రామాల్లో ఇరు పార్టీల నేతలు తమ పాత వైరాన్ని మరిచి కలిసిపోవడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారుతున్నది. ఇదిలా ఉండగా నామా నాగేశ్వరరావు పార్టీ మారుతారని జరిగిన ప్రచారానికి ఈ వ్యాఖ్యలతో ఫుల్‌స్టాప్ పడింది. కాంగ్రెస్ నేతలతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారని, ఆయన పార్టీ మారి ఖమ్మం నుంచే పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దానిపై నోరు మెదపని నామా మధిర నియోజకవర్గంలో భట్టివిక్రమార్కతో కలిసి పాల్గొన్న సమావేశంలో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఏ పార్టీతోనైనా జత కట్టేందుకు వెనుకాడబోమని చెప్పడం ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తుంది. ఇదే సభలో పాల్గొన్న భట్టివిక్రమార్క తెలుగుదేశం పార్టీ విధానాలను ప్రస్తావించకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేయడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో నామా తిరిగి ఖమ్మం పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థిగానే కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తారని ఆ పార్టీ శ్రేణులు బాహటంగానే పేర్కొంటున్నారు. అయితే ఇనే్నళ్ళు ఖమ్మం జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ విధానాలపై ఇంతవరకు ఎక్కడా మాట్లాడకపోవడంపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఐక్యంగా పోటీ చేసేందుకే ఆసక్తి చూపుతుండటం గమనార్హం.