రాష్ట్రీయం

ఇక అన్ని ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రధానంగా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, వృత్తి విద్యా కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం నాడు నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి తుది ఆమోదం పొందాలని నిర్ణయించినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మధ్యాహ్న భోజన కార్యక్రమం కాంట్రాక్టును అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, నీటిపారుదల మంత్రి హరీష్‌రావు, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ మంత్రి జోగు రామన్నలు సచివాలయంలో రెండోసారి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐలూ, బిఈడీ కాలేజీలు, మోడల్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు కావల్సిన వౌలిక వసతులు సమకూర్చుకోవాలని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులకు మంత్రుల కమిటీ సూచించింది. అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు అందించే భోజనాన్ని సచివాలయంలో మంత్రులు అంతా రుచి చూశారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా అందించే భోజనాన్ని అధికారులు కూడా ఆరగించారు. అక్షయపాత్ర ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా అన్నపూర్ణ పథకాన్ని అమలుచేస్తున్నామని, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పథకాన్ని నడిపిస్తున్నామని, అక్షయపాత్ర ఫౌండేషన్ అధికారి రవిలోచన్ దాస్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కంది, నార్సింగి, కొత్తగూడెం, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో కిచెన్లు ఉన్నాయని, మరో ఆరు కిచెన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. మధ్యాహ్న భోజన పథకంలో పోషక విలువలున్న భోజనం అందించేందుకు మెనూ వాటి ధరల నివేదికను ఈ నెల 6వ తేదీన అందించాలని మంత్రుల కమిటీ అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులను కోరింది. ఈ నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించిన తర్వాత ఆయన నిర్ణయం ప్రకటిస్తారని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా మధ్యాహ్న భోజనం కాలేజీ విద్యార్థులకు ప్రారంభించే ముందు ట్రయిల్ రన్ చేయాలని సూచించింది. మంత్రుల కమిటీ సూచనను అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు అంగీకరించారు. వీలైనంత త్వరలో కిచెన్లు కూడా ఏర్పాటు చేస్తామని మధ్యాహ్న భోజనం అందించడంపై మూడు నాలుగు రోజుల్లో నివేదిక ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, మోడల్ జూనియర్ కాలేజీల డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు.