రాష్ట్రీయం

నాలుగేళ్ల తెలంగాణపై సథస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ విద్య, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య సంస్థ (టిఈఎస్‌సిల్‌ఎస్) ఆధ్వర్యంలో తెలంగాణ గతం- వర్తమానం- భవిష్యత్ అంశాలపై 17 సదస్సులు ఏర్పాటు చేసినట్టు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వెల్చాల కొండలరావు తెలిపారు. తొలుత జర్నలిజంలో పరిణామాలపై 5వ తేదీ ఉదయం 9 గంటలకు రవీంద్రభారతి మినీ హాలులో సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు. 12న పరిశ్రమల రంగంపై ఫ్యాప్సీ హాలులో, 19న సంస్కృతిపైన రవీంద్రభారతిలోనూ, 26న ఉన్నత విద్యపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సదస్సులుంటాయని చెప్పారు. సెప్టెంబర్ 2న భాష, సెప్టెంబర్ 9న చరిత్రపై, 16న పర్యాటకరంగంపైనా, 23న న్యాయ అంశాలపైనా, 30న వ్యవసాయం, అక్టోబర్ 7న పాఠశాల విద్య, 14 ప్రజాకర్షక పథకాలపైనా, 21న హెల్త్ కేర్, 28న ఉపాధి, నవంబర్ 4న అవినీతి నిర్మూలన, 11న ద్రవ్యోల్బణం, నవంబర్ 18న శాంతి భద్రతలు, 25న మానవ హక్కులపైనా సదస్సులు జరుగుతాయి. 5న జర్నలిజంపై జరిగే సదస్సుకు సీనియర్ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి అధ్యక్షత వహిస్తారని, ముఖ్య వక్తగా కే శ్రీనివాస్, టీవీ జర్నలిజంపై డి అమర్, ఉమా సుధీర్, ప్రింట్ మీడియాపై కే శ్రీనివాసరెడ్డి, వాక్‌స్వాతంత్య్రంపై పాసం యాదగిరి, రేడియో జర్నలిజంపై కారంచేడు గోపాలం, సామాజిక మాద్యమాలపై సుమనస్పతి రెడ్డి, మీడియా ట్రెండ్స్‌పై ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడతారని, సదస్సుకు కన్వీనర్‌గా సీహెచ్ రాజేశ్వరరావు వ్యవహరిస్తారని డాక్టర్ వేల్చాల కొండలరావు చెప్పారు.