రాష్ట్రీయం

దివ్యాంగుల విద్యపై చిన్నచూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: సరిపడా నిధులిస్తాం, అవసరమైతే అదనంగా నిధులు ఇస్తాం అని కేంద్రం హామీ ఇస్తున్నప్పటికీ, దివ్యాంగుల విద్యపై నిధులు వెచ్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఎక్కువ నిధులు పొందితే దామాషాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ మేరకు నిధులు విడుదల చేయాల్సి వస్తుందనే భయమే ఇందుకు ప్రధాన కారణమన్న అనుమానాలు ఉన్నాయి. బంగారు తెలంగాణ రాష్ట్రంలో బడి ఈడు వయస్సున్న దివ్యాంగులకు కేంద్రం విభిన్న పథకాల కింద ఆర్థిక సాయం చేస్తున్నా, దివ్యాంగుల సహిత విద్య అమలుకు నిధులు ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సానుకూలంగా లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో దివ్యాంగుల విద్యకు ప్రధానోపాధ్యాయులకు అవగాహన లోపం, విద్యాశాఖలో సహిత విద్య విధానంలోనే లోపం అవరోధాలుగా మారుతున్నాయి. ఫలితంగా ఈ దిశగా పథకాలు ఏవీ సక్రమంగా అమలు కావడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు మినహా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఏ మాత్రం దృష్టి సారించడం లేదన్నది కఠోర సత్యం. ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకానికి వస్తే, ప్రస్తుతం 169 మందికి ఒకరు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి సహిత విద్యా విధానం ప్రకారం ప్రతి పది మందికి ఒక టీచర్ ఉండాలి. ప్రత్యేక ఉపాధ్యాయులు మండలానికి ఇద్దరు చొప్పున నియమించడం వల్ల సహిత విద్య విఫలమైంది, ప్రతి పాఠశాలకు ఇద్దరు చొప్పున నియమిస్తే సత్ఫలితాలు వస్తాయనే భావన వ్యక్తమవుతోంది. టీఏ, ఎస్కార్ట్ అలవెన్స్ సకాలంలో అందకపోవడం వల్ల అనుకున్న లక్ష్యాలను ప్రభుత్వం చేరుకోలేకపోతున్నదనే వాదన వినిపిస్తున్నది. రాష్ట్రం మొత్తంగా చూస్తే ఇంత వరకూ సహిత విద్యకు ఒక విధానం అంటూ లేకుండా పోయింది. స్పష్టమైన పాఠ్యప్రణాళిక కూడా అమలులోకి రాకపోవడం, రాష్ట్ర స్థాయిలో సహిత విద్య అమలుకు నిష్ణాతులు లేకపోవడం కూడా పెద్ద లోపంగా మారింది. ఆవాస ప్రాంత పాఠశాలలో 45,159 మంది దివ్యాంగులు చేరారని, వీరిలో ప్రాధమిక స్థాయిలో 38,188, దివ్యాంగులు, మాధ్యమిక స్థాయిలో 5858 మంది, ఎయిడెడ్ పాఠశాలల్లో 363 మంది, దివ్యాంగుల శాఖ కింద ఆరు ఆశ్రమ పాఠశాలల్లో 750 మంది చేరారని అన్నారు. వీరి కోసం సుమారు 68 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయని, వీటిలో సుమారు 1000 మంది దివ్యాంగులు సేవలను పొందుతున్నారని దివ్యాంగుల సహిత విద్య నేషనల్ నెట్‌వర్కు కన్వీనర్ కల్పగిరి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానంలో సహిత విద్య గురించి పేర్కొన్నా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకంలో అమలుచేయడం లేదని ఆయన ఆరోపించారు.