రాష్ట్రీయం

తాగునీటికే శ్రీరాంసాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో తక్కువగా నీరు ఉన్నందున తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి హరీష్ రావు, నిజామాబాద్ ఎంపీ కవిత, మిషన్ భగీరథ వైస్-చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్, విద్యాసాగర్ రావు, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సీఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులో ఉన్న నీటిని గురించి అధికారులు వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డెడ్ స్టోరేజీ, ఆవిరి నష్టాలకు బొటాబొటిన ఉన్నందున ప్రథమ ప్రాధాన్యం తాగునీటికి ఇవ్వాలన్నారు. వచ్చే వేసవిలో ప్రజల తాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా కాపాడుకుని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రస్తుతం ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టు ద్వారా కాకతీయ కెనాల్, లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ పరిథిలోని రైతుల అవసరాలను జాగ్రత్తగా అంచనా వేస్తున్నామన్నారు. కొద్ది రోజుల్లో ప్రాజెక్టు ఎగువన మంచి వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీరు చేరితే, ఆయకట్టు అవసరాలకు నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో అంచనా వేస్తూ, నీటి పారుదల శాఖ క్షేత్ర స్థాయి నుంచి మానీటరింగ్ చేస్తున్నామని ఆయన చెప్పారు.
రూ.1100 కోట్లతో..
శ్రీ రాం సాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు రూ.1100 కోట్లతో పునరుజ్జీవన పథకాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. వచ్చే యాసంగి నాటికి పనులను పూర్తి చేసి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరు అందించాలని ప్రభుత్వం దృడసంకల్పంతో ఉందన్నారు. కొన్ని పార్టీల నాయకులు తమ స్వార్థం కోసం అమాయక రైతులను రెచ్చగొడుతున్నందున, రైతులు అప్రమత్తంగా ఉండాలని, మోసపోవద్దని హితవు పలికారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. కాబట్టి రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి హరీష్ రావు కోరారు.