రాష్ట్రీయం

సిద్దిపేటలో సెంట్రల్ వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: సిద్దిపేటలో సెంట్రల్ వర్శిటీకి, కేంద్రీయ విద్యాలయాలకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా 13 సెంట్రల్ వర్శిటీలను నెలకొల్పనున్న విషయం తెలిసిందే. కాగా, మధ్యప్రదేశ్‌లో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కూడా మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కేంద్రీయ విద్యాలయాలను యూపీలో బాండ, మహారాష్టల్రో వాషిం, మణిపూర్‌లో చక్‌పికరోంగ్, మహారాష్టల్రో పర్బాణి, బీహార్‌లో నవడ, యూపీలో మిర్జాపూర్, యూపీలో బాదోహి, జార్ఖండ్‌లో పాలం, కర్నాటకలో కుదమలకుంటె, యూపీలో సిఐఎస్‌ఎఫ్ సూరజ్‌పూర్, బీహార్‌లో దేవ్‌కుండ, యూపీలోని బాయిలీలో ఇవి ఏర్పాటవుతాయి. వీటితోపాటు తెలంగాణలో సిద్దిపేటకు ఈ అవకాశం దక్కింది. ఈ విద్యాసంస్థల్లో 13,000 మందికి అడ్మిషన్ చేసేందుకు వీలు కలుగుతుంది. మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసే జవహర్ నవోదయ విద్యాలయ వల్ల మరో 560 మంది విద్యార్థులకు అడ్మిషన్లు దొరుకుతాయి. ఈ విద్యాసంస్థల్లో ఆరో తరగతి నుండి 12వ తరగతి వరకూ క్లాసులు నిర్వహిస్తారు. సిద్దిపేటలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి ఢిల్లీ వెళ్లినపుడల్లా ఈ విద్యాసంస్థ ఏర్పాటుకు సంబంధించి కోరుతునే ఉన్నారు. అలాగే ఎంపీల తరఫున వినోద్‌కుమార్ సైతం హెచ్‌ఆర్‌డీ మంత్రిని కలిసి అనేక మార్లు సిద్దిపేటలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై డిమాండ్ చేశారు.