రాష్ట్రీయం

పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఆగస్టు 4: ప్రజలను ఎదుర్కొలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయించారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్టాడిన ఆయన రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీకాలం 30 రోజుల్లో ముగుస్తుందనగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అయితే ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విజయం సాధించరన్న భయంతోనే సీఎం వాయిదా వేయించి గ్రామ పరిపాలనకు తూట్లు పొడిచారన్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్‌లు లేకపోతే పరిపాలన సజావుగా సాగదన్నారు. పంచాయతీ వ్యవస్థను టీడీపీ నిర్వీర్యం చేస్తోందన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించి అధికార పార్టీ నేతలు నిధులు దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజలపై నమ్మకం ఉంటే వెంటనే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజుకోమాట చెబుతుండటంతో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. దేశంలో ఎన్నికలు జరిగితే బీజేపీకి 150 స్థానాలకు మించి రావన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న ఆర్థికలోటు భర్తీ అవుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎన్ని సీట్లు గెలిచినా రాష్ట్రాలకు మేలు జరగదన్నారు. అధికార దాహంతో చంద్రబాబు, జగన్ 25 ఎంపీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని కోరుతున్నారని, ఆయా పార్టీలకు ఓట్లు వేసే ముందు ప్రజలు బాగా ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఐదు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉంటారని, ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థే సీఎం అవుతారన్నారు.

నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కర్నూలు జిల్లా ఆలూరు క్వారీలో పేలుడు జరిగి 11 మంది మృత్యువాతపడ్డారని రఘువీరా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమయిందన్నారు. మైనింగ్ అధికారులు సరైన తనిఖీలు నిర్వహించకపోవడం, అక్రమ తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రమత్తువీడి ఆలూరు సంఘటనపై విచారణ నిర్వహించి క్వారీని మూసివేయించాలన్నారు. అక్రమ లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు.