రాష్ట్రీయం

విజయాలకు వెలుగు జ్ఞానభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 4: సమాజ హితం కోసం ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేందుకు జ్ఞాన భేరిని ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యార్థుల్లో ప్రతిభ, ఆలోచన విధానానికి స్ఫూర్తిని కలిగించాలన్నదే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్ఞానభేరి విజయభేరిగా మారి ఉన్నత శిఖరాలను అందుకోవడానికే కాకుండా సమసమాజ నిర్మాణానికి బాటలు వేయాలని విద్యార్థులకు చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి జ్ఞానభేరి కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని శనివారం తిరుపతి తారకరామా స్టేడియంలో నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలో ఉన్న 7 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలలకు సంబంధించిన విద్యార్థులకు ఆయా రంగాలకు సంబంధించిన అం శాలపై పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు. అనంతరం జ్ఞానభేరి సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపికైన విద్యార్థుల్లోని సృజనాత్మకతను స్వయంగా పరిశీలించారు. అనంతరం వారికి జ్ఞాపికలు, ప్రతిభా ధృవపత్రాలను అం దించి అభినందించారు. ముఖ్యంగా డెయిరీ టె క్నాలజీ, వ్యవసాయ రంగం, పశువైద్యవిశ్వవిద్యాలయం, స్విమ్స్‌కు సంబంధించిన విద్యార్థు లు తాము ప్రతిపాదించిన అంశాలను సీఎం ముందు వివరించి ప్రజలకు ఎలా మేలుజరుగుతాయో తెలియజేసిన తీరుకు బాబు ముగ్ధుడయ్యాడు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో పరిశీలన చేసి తెలియజేసిన అంశాలను సభకు హాజరైన 15వేల మంది విద్యార్థులకు వివరించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విద్యార్థి తమలోని సృజనాత్మకతకు నూతన ఆలోచనలను క్రోడీకరింపజేసి సమాజానికి ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. అంతకుమునుపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ప్రజాసంక్షేమ కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. 40 సంవత్సరాల క్రితం ఎస్వీయూలో విద్యార్థిగా ఉంటూ ఎమ్మెల్యేని అయ్యానన్నారు. ఈ జ్ఞానభేరి సభ ఎస్వీయూ తారకరామా స్టేడియంలో నిర్వహిస్తూ ఉంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. 1972-73 సంవత్సరాల్లో మీకన్నా ఉత్సాహంగా కేరింతలుకొట్టానంటూ విద్యార్థులను ఉత్సాహ పరిచారు. ప్రపంచంలో ఏదేశంలో లేని యువశక్తి భారతదేశానికి ఉందన్నారు. నేటి యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసే విధానం పోయి, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. అలా జరగాలంటే విద్యార్థులు తమ సృజనాత్మకతకు సాంకేతికతను జోడించి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. 1995లో ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రంగా గుర్తింపు పొందిందన్నారు. అప్పుడు ఐటీ రంగం, కాలేజీలు లేవన్నారు. 1350 కంపెనీలతో ఒప్పందం కుదుర్చు కోవడంతో 3.70 లక్షల మందికి ఉద్యోగాలు, వౌలిక సదుపాయాలు లభించండం హైదరాబాద్ హైటెక్ సిటీగా ప్రపంచ పటంలోకి ఎక్కిందన్నారు. నేడు జీఎస్టీ ద్వారా రూ. 95వేల కోట్లు నేడు తెలంగాణకు ఆదాయం వస్తోందంటే తాను చేపట్టిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. అంత గొప్పగా అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను వదలి రావడం బాధగా లేదా అని తనను పలువురు ప్రశ్నించారన్నారు. తాను వేసిన విత్తనం మహా వృక్షమైందన్న సంతోషం తనకు ఉందన్నారు. అన్ని సవ్యంగా ఉన్నప్పుడు పాలన అందించడం ఒక ఎత్తయితే సమస్యలు ఎదురైనప్పుడు వాటిని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినవాడే నాయకుడయ్యే అర్హత ఉందన్నారు. ఆ స్ఫూర్తితోనే తాను కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడుపుతూ ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు కొరతలేకుండా పాలన అందిస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధించలన్నది తన ప్రధాన ఉద్దేశ్యమన్నారు. అందుకే విద్యారంగాన్ని నవ్యాంధ్రలో కూడా గొప్పగా ముందుకు తీసుకు వెడుతున్నానని సీ ఎం అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి తానెంతగా కృషి చేస్తున్నానో విద్యార్థులు గుర్తించాలన్నారు. ప్రస్తుతం ఈ జ్ఞానభేరి సభకు హాజరైన విద్యార్థులంతా పిన్నవయస్కులని భవిష్యత్తులో రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధికి సాక్షీభూతులన్నారు. అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. పరిశ్రమల అభివృద్ధితోనే ఉద్యోగాలు వస్తాయన్నారు. అందుకే భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. అవన్నీ వస్తే 36లక్షల 85వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. కేంద్ర నిధులు ఇవ్వక పోయినా అభివృద్ధిని తాను ఆపడంలేదన్నారు. వ్యవసాయ రంగం దేశంలో కుదుపులతో సాగుతున్నా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ప్రతి ఏడాది అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు. వ్యవసాయ రంగంలో జాతీయ స్థాయిలో 2.5శాతం అభివృద్ధి ఉంటే, ఏపీలో 11 శాతం అభివృద్ధిలో ఉందన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి 12 ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే 6 విశ్వవిద్యాలయాలు తమ పనులు ప్రారంభించాయన్నారు. ఎస్ ఆర్ ఎం, అమృత, విట్ సంస్థలు తమ పనులను ప్రారంభించాయన్నారు. జాతీయ స్థాయిలో 11 సంస్థలు ఏర్పాటుకు కేంద్రంతో పోరాడుతున్నామని చెప్పారు. ప్రజాసంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలను వారికి వివరించారు. సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానమైనప్పుడే నూతన ఆవిష్కరణలు సాధ్యమన్నారు. ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలకు పదునుపెట్టినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విశాఖను తుఫాను ముంచెత్తినప్పుడు ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. అయితే విద్యుత్ సరఫరాకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఆ సమయంలో ఏంచేయాలని ఆలోచించినప్పుడు ఎల్ ఈ డి బల్బులకు శ్రీకారం చుట్టామన్నారు. దీనికి సంబంధించిన ఎల్ ఈ డి బల్బుల ఉత్పత్తిదారులతో సమావేశమై సాధారణంగా ఉపయోగించే విద్యుత్‌లో 35శాతం ఆదా చేసి తక్కిన 65శాతం ఉత్పత్తిదారులకు ఇచ్చామని అన్నారు. దీంతో రెండు, మూడు నెలల్లోనే విశాఖలో ఎల్ ఈడి బల్బుల వెలుగులు విరజిమ్మాయని, పైసా పెట్టుబడి లేకుండా ఇలా సత్పలితాలు సాధించామన్నారు. నూతన ఆలోచనలు ఇలా సత్ఫలితాలు ఇస్తాయన్నారు. ఈక్రమంలో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేశామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని పంచాయతీల్లో ఎల్ ఈ డి బల్బులు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు హైస్కూల్ స్థాయిలో 6వేల తరగతుల్లో వర్చువల్ తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చంనాయుడు, అమరనాథ్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎంపీ శివప్రసాద్, పోలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి, ఎమ్మెల్యేలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుగుణమ్మ, తలారి ఆదిత్య, శంకర్, ఎమ్మెల్సీ దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల వీసీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు నల్లారి కిషోర్‌కుమార్, పులివర్తి నాని, పరసారత్నం, రవినాయుడు, శ్రీ్ధర్ వర్మ, టీటీడీ పాలక మండలి సభ్యుడు బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు.