రాష్ట్రీయం

నిబంధనలకు నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఆగస్టు 4: కర్నూలు జిల్లాలో 10 మంది కార్మికుల ప్రాణాలు బలిగొన్ని క్వారీలో బ్లాసింగ్‌కు అనుమతి లేదని తెలిసింది. అనుమతి లేకుండానే ఇక్కడ అక్రమంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో అమాయకులైన కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుండి బ్లాస్టింగ్ చేసే కంపెనీలు వచ్చి రాళ్లు పగులగొట్టాల్సి ఉంది. అయితే ఈ క్వారీలో యాజమాన్యం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా రేకుల షెడ్డులో జిలెటెన్ స్టిక్స్ నిల్వ ఉంచి కార్మికులతో బ్లాస్టింగ్ పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడే కూలీల కోసం మరో షెడ్డు వేసి నివాసం ఏర్పాటు చేయడం గమనార్హం. క్వారీ కోసం యజమానికి ప్రభుత్వం కేవలం రెండున్నర హెక్టర్ల భూమి కేటాయించగా అక్రమంగా ఏడున్నర హెక్టార్లలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామం సమీపంలో శుక్రవారం జరిగిన క్వారీలో పేలుడుకు యాజమాన్యం నిర్లక్ష్యం, సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడమే కారణమని తెలుస్తోంది. దీంతో పొట్టచేత పట్టుకుని ఒడిస్సా, జార్ఖండ్ నుండి వచ్చిన కూలీలు బలయ్యారు. క్వారీలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, ప్రమాదం జరిగినపుడు ప్రాథమిక చికిత్స అందించేందుకు సైతం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. అందువల్లే శుక్రవారం జరిగిన భారీ పేలుడులో పది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బ్లాస్టింగ్ జరిగిన క్వారీకి అగ్రహారం, హత్తిబెళగల్ గ్రామాలు దగ్గర్లో ఉన్నాయి. క్వారీలో పేలుళ్లు నిర్వహిస్తే గ్రామాలకు ప్రమాదమని తెలిసినా రెవెన్యూ, గనులశాఖ, అగ్నిమాపకశాఖ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. క్వారీలో పేలుళ్ల వల్ల తమ ఇండ్లు బీటలు బారుతున్నాయని హత్తిబెళగల్ గ్రామస్థులు నాలుగేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీని మూసివేయించాలని జన్మభూమి, గ్రామదర్శినిలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. క్వారీ యజమానికి ప్రతిపక్ష, అధికారపక్ష నాయకుల అండదండలు ఉండడం వల్లే క్వారీ వైపు ఎవరూ కనె్నత్తచూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్వారీని మూసివేయాలని అగ్రహారం, హత్తిబెళగల్, కురవళ్లి, ఆలూరు ప్రజలు కోరుతున్నారు.