రాష్ట్రీయం

ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలుచేస్తున్న బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు చేస్తోందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ యాక్టును రక్షించేందుకు అవసరమైతే ప్రాణాలర్పిస్తానని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు చేస్తోందన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచమైన అట్రాసిటీ యాక్టును బీజేపీ కావాలనే నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును యధాతథంగా తేవాలని, ఇందుకు ఆర్డినెన్స్‌ను ఈ నెల 10లోగా కేంద్రం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని యధాతధ పరిస్థితి కోసం ఈ నెల 9వ తేదీన భారత్ బంద్‌లోగా ఆర్డినెన్స్‌ను తేవాలన్నారు. ఈ చట్టం విషయంలో ముందస్తు బెయిల్, 30 రోజుల్లోపు అరెస్టు, స్టేషన్ బెయిల్ ఇవ్వకపోవడం వంటివాటితో పాటు ఈ చట్టం యధాతధంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చట్టం అమలుకు రెవెన్యూ, న్యాయ, పోలీసు శాఖల్లో అవసరమైన మార్పులు చేయాలన్నారు. ఈ చట్టాన్ని యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన రాజమహేంద్రవరం స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం నుంచి కొవ్వూరులోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు ఛైర్మన్ కారెం శివాజీ తెలిపారు. ఈ నిరసన ర్యాలీలో మంత్రులు నక్కా ఆనందబాబు, జవహర్, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య తదితరులు పాల్గొంటారని చెప్పారు.