రాష్ట్రీయం

ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు: క్రమశిక్షణకు, నిబద్ధతకు నిలువుటద్దం నందమూరి తారక రామారావు అని హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా ఇటు సినిమా రంగంలో.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో అటు రాజకీయ ప్రజాసేవా రంగంలో తనకుతానే సాటిగా నిలిచిన ఎన్టీఆర్ జీవితం యావత్ భారతదేశ ప్రజానీకానికి ఆదర్శవంతంమేనన్నారు. దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ‘ఎన్టీఆర్’ పేరుతో చలన చిత్రాన్ని నిర్మిస్తున్న బాలకృష్ణ ఆ చిత్ర దర్శకుడు క్రిష్‌తో కలిసి శనివారం ఎన్టీఆర్ స్వగ్రామమైన కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు, ఎన్టీఆర్ సతీమణి స్వగ్రామమైన మండల పరిధిలోని కొమరవోలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారువురూ మీడియాతో మాట్లాడారు. కలుషితమై ఉన్న రాజకీయ వ్యవస్థలో కల్మషం లేని వ్యక్తిగా ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయ వ్యవస్థనే మార్చివేశారన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ ప్రత్యక్ష దైవంగా నిలిచారని, భారతరత్న పురస్కారానికి ఎన్టీఆర్ నూరు శాతం అర్హులన్నారు. మహోన్నతమైన చరిత్ర కల్గిన ఎన్టీఆర్ బయోపిక్‌లో తానే నటిస్తూ నిర్మించటం తన అదృష్టమన్నారు. 2019, జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల చేయనున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు.
ఎన్టీఆర్ చిత్రం నిర్మించటం
పూర్వజన్మ సుకృతం: క్రిష్
రాజకీయల కతీతంగా యధార్థ జీవిత చరిత్రతో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్నామని ఆ మహానటుడి చరిత్రతో కూడిన చిత్రానికి దర్శకత్వం వహించటమంటే పూర్వజన్మ సుకృతమని దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు. బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగ నిధి నిర్వహణ, పాడి పంటలలో భాగస్వామ్యం ఉన్న నిమ్మకూరు, కొమరవోలులో ఎన్టీఆర్ జీవన స్మృతుల గురించి బంధుమిత్రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిత్రంలో సన్నివేశాలు చిత్రీకరించటానికి ఎన్టీఆర్ సొంత పంట భూములను, పాఠశాలను, సొంత ఇంటిని పరిశీలించారు. తొలుత నిమ్మకూరు, కొమరవోలులలో ఎన్టీఆర్ బసవరామ తారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఘన స్వాగతం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బులయ్య, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, బాలకృష్ణ మేనల్లుడు, టీడీపీ జిల్లా నేత పొట్లూరి కృష్ణబాబు, జెడ్పీటీసీ పొట్లూరి శశి, మండల టీడీపీ అధ్యక్షుడు కుదరవల్లి ప్రవీణ్ తదితరులు బాలకృష్ణ, క్రిష్‌లను ఘన స్వాగతం పలికారు. నిమ్మకూరు టీటీడీ వెంకటేశ్వరాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం నందమూరి వంశస్థులతో, అనంతరం కొమరవోలులో పొట్లూరి వంశస్థులతో వారు మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని ఘట్టాలు అడిగి తెలుసుకున్నారు. ఇటు బాలకృష్ణ అభిమానులు, అటు టీడీపీ కార్యకర్తలు విశేష సంఖ్యలో విచ్చేయటంతో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.