రాష్ట్రీయం

సాటిలేని ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 5: ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇంధన సామర్థ్యానికి సంబంధించి కేంద్ర విద్యుత్ శాఖ తొలిసారిగా విడుదల చేసిన ఇంధన సామర్థ్య సన్నద్ధత సూచీలో ఏపీ అగ్రపథాన నిలిచింది. ఇంధన సామర్థ్య సంస్థ (బీఈఈ), నీతి ఆయోగ్ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి.బీఈఈ సూచిక 63 ప్రామాణికాల ఆధారంగా భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, రవాణా, వ్యవసాయం, డిస్కంలలో ఇంధన సామర్థ్య ఫలితాలను అంచ నా వేశారు. ఇందులో ఏపీ అత్యుత్తమ సామర్థ్యం కనబరచగా, కేరళ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇంధన పొదుపులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సామర్థ్య కార్యక్రమాల అమలు వంటి కీలక అంశాలను పరిశీలించి బీఈఈ ఏపీకి గుర్తింపునిచ్చింది. బీఈఈ సూచీలో ఐదు ఉత్తమ రాష్ట్రాలను ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అత్యుత్తమ విధానాలు అవలంబిస్తోందని ప్రశంసించింది.మున్సిపాలిటీలు, భవనాలు, ఇళ్లు, డిస్కంలు, పరిశ్రమల్లో పీఏటీ (పెర్ఫార్మ్ ఎఛీవ్, ట్రేడ్) పథకం ద్వారా రాష్ట్రం ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు చేస్తోంది. రవాణా రంగంలోనూ ఈ కార్యక్రమాలను మెరుగ్గా అమలు జరుపుతోందని బీఈఈ నివేదికలో వివరించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్, డిజైన్‌కు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్లాటినం అవార్డు దక్కినందుకు బీఈఈ సూచిక నివేదికలోనూ కొనియాడారని ఇంధన, పెట్టుబడులు, వౌలిక సదుపాయాలు, సీఆర్డీఏ
ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావులకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇంధన మంత్రి సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, అజయ్ జైన్, ట్రాన్స్‌కో సీఎండీ కె విజయానంద్ ప్రభృతులను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే పనితీరు కొనసాగించాలని కోరారు. ఇంధన సామర్థ్య ఫలితాలు సాధారణ వినియోగదారులకు దక్కాలని స్పష్టం చేశారు. ఇంధన సామర్థ్యానికి సంబంధించి జపాన్ లాంటి దేశాల్లో వినియోగించే అత్యాధునిక టెక్నాలజీని రాష్ట్రంలో అమలు చేయాలని పునరుద్ఘాటించారు. ఆధునిక సాంకేతికతను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా, విద్యుత్ రంగంలో ఏపీ ఇప్పటికే అత్యద్భుత పనితీరు ప్రదర్శించిందని, 84 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధించిందని వివరించారు. తాజాగా బీఈఈ సూచీలో అగ్రభాగాన నిలవటం సంతోషదాయకమన్నారు. ఏపీ అతి తక్కువ సరఫరా, పంపిణీ నష్టాలను నమోదు చేసిందని విజయానంద్ తెలిపారు. జాతీయ స్థాయిలో సగటు 25శాతం ఉండగా ఏపీ కేవలం 9.72 శాతం అతి తక్కువ టీ అండ్ డీ నష్టాలు ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందిందని వివరించారు. ఈ నష్టాలను మరింత తగ్గించేందుకు విద్యుత్ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అలయెన్స్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎకానమీ (ఏఈఈఈ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ అన్నింటికంటే ముందుగా ఇంధన సామర్థ్యం ప్రభావాన్ని 2014లోనే అంచనా వేసిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో నిరంతర విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నారని చెప్పారు. ఈఈఎస్‌ఎల్ ద్వారా కేవలం రూ. 10కే గృహ వినియోగదారులకు 2కోట్ల ఎల్‌ఈడీ బల్బులు అందించిన రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు. ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటులో ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.