రాష్ట్రీయం

ఏపీ అభివృద్ధికి పూర్తి సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఆగస్టు 5 : ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీ తాత్కాలిక తరగతులను ఆదివారం ప్రారంభించిన జావదేకర్ దేశాభివృద్ధిలో రాజకీయాలు ఉండవని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోదీ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. మానవ ఎదుగుదలకు విద్య ఎంతో అవసరమని గుర్తించి దేశ వ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. స్వయం పోర్టల్ ద్వారా 32 కోర్సులను ఉచితంగా అందిస్తున్నామని, పోర్టల్‌లో
లాగిన్ కావడం ద్వారా ఎవరైనా వారికి కావాల్సిన విద్యను అభ్యసించవచ్చు అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులను చేయాలనే ఉద్దేశ్యంతో మోదీ పని చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే పార్లమెంటు, లోక్‌సభ్‌లో 30 బిల్లులు పెడింగ్‌లో వున్నా కేంద్ర విశ్వవిద్యాలయం అనంతపురం బిల్లును త్వరితగతిన పాస్ చేయించి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి, దాదాపు రూ. 460కోట్లు విడుదల చేశారన్నారు. ఈ వర్శిటీ అభివృద్ధికి రాబోయే మూడేళ్లలో రూ. 500 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 7 యూనివర్శిటీలను ప్రారంభించామని, వాటికి దాదాపు రూ. 3,600 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. ఈ యూనివర్సిటీల్లో రాబోయే పదేళ్లలో 5వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తారని తెలిపారు. దేశంలో 17 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉన్నారని, వారికి కేంద్ర ప్రభుత్వంతో పాటు 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు సైతం విద్యను అందించి అక్షర్యాసులుగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ యూనివర్శిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూమి కేటాయించగా కేంద్ర ప్రభుత్వం రూ. 3,600 కోట్ల నిధులు విడుదల చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నింటినీ వరుసగా నెరవేరుస్తున్నారని తెలిపారు. తమ నినాదం అభివృద్ధే కానీ, రాజకీయాలు కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏపీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందుకు నిదర్శనంగా రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 7 కేంద్ర యూనివర్సిటీలను ప్రారంభించి, వాటికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి నిధులు కేటాయించామన్నారు. అలాగే రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని క్యాబినెట్‌లో ఉంచామని, ఆమోదం పొందిన తక్షణమే ప్రారంభిస్తామన్నారు. మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని స్పష్టం చేశారు.

చిత్రం..సెంట్రల్ యూనివర్శిటీ తరగతుల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని
ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్