రాష్ట్రీయం

సృజనకు చుక్కాని ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 7: ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.తాను అనునిత్యం విద్యార్థిగానే ఉంటానని, చదువు అనేది నిరంతరం నేర్చుకోవాలని, ఏదైనా ఉంటే దానిని రెండు నిమిషాల్లో నేర్చుకుంటానని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండలం దూబగుంట గ్రామంలో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ట్రిపుల్ ఐటికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చదువుతోనే జీవితాలను ఉన్నత మార్గంలోకి తీసుకెళ్లడం సాధ్యమవుతుందన్నారు. ఉన్నతమైన
వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందాలంటే విద్య ఎంతో అవసరమని తెలిపారు. నాల్జెడ్ ఎకానమీ అభివృద్ధి కావాలంటే ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అవసరమని తెలిపారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రావీణ్యం ఉంటే మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకెళుతోందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలోని పిల్లలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని ఆయన విద్యార్థులకు సూచించారు. దేశంలో జెఈఈ, ట్రిపుల్ ఐటి, నీట్ పరీక్షల్లో అత్యధిక సంఖ్యలో సీట్లను తెలుగు విద్యార్థులే సాధిస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ 1గా ఉంటాలన్నదే తన లక్ష్యమన్నారు. ప్రపంచంలో బెస్ట్ నాల్జెడ్ బేస్డ్ యూనివర్శిటీలను రాష్ట్రానికి తీసుకువస్తామని ఆయన తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన 11 యూనివర్శిటీలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యున్నత కంపెనీల్లో ప్రధాన పదవుల్లో సత్య నాదెళ్ల వంటి వారు మన తెలుగువారేనని ఆయన సగర్వంగా చెప్పుకొచ్చారు. విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రతి విషయాన్ని పరిశోధనాత్మక విధానంలో ముందుకెళ్లాలని ఆయన విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తు పూర్తిగా నాల్జెడ్ ఎకానమీగా మారనున్నదని తెలిపారు. స్మార్ట్ఫోన్ ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ సేవలు పొందవచ్చునని తెలిపారు. విద్యార్థులు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలన్నారు. తెలివిలో మన పిల్లలు మట్టిలో మాణిక్యాలని ఎంత సాన పడితే అంత మెరుగు పడతారని ఆయన తెలిపారు. విద్య విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చామ, పేద పిల్లలు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు వెచ్చిస్తుందన్నారు. తరగతి గదుల్లో డిజిటల్ క్లాసులు పెట్టామని, అదేవిధంగా వర్చువల్ క్లాసులు పెడుతున్నామని ఆయన వెల్లడించారు. ఒత్తిడి లేని చదువులు చదవాలని, విద్యార్థులు చదువుతో పాటు యోగా, కూచిపూడి వంటివి నేర్చుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ఇస్తున్నామన్నారు. స్కిల్‌డెవలప్ కోసం మంచి సంస్థను తీసుకువచ్చి నైపుణ్యాభివృద్ధిని అందించే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్భ్రావృద్ధిలో అందరూ భాగస్వామలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సులభతరమైన వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా ఉందని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడిని అధిగమించగలిగితే గోదావరి, కృష్ణా జిల్లాల కంటే అభివృద్ధి చెందే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి ఐటీ కంపెనీలన్నీ తన హయాంలోనే హైదరాబాద్‌కు వచ్చాయని ఆయన తెలిపారు.

చిత్రం..దూబగుంటలో ట్రిపుల్ ఐటీ కళాశాలకు భూమిపూజ చేస్తున్న చంద్రబాబు