రాష్ట్రీయం

తిరుపతిలో చండీగఢ్ హైకోర్టు జడ్జి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 7: మహాశివరాత్రి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన చండీఘడ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరేష్‌కుమార్(60) గుండె పోటుతో మృతి చెందారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుచానూరు, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకున్న ఆయన మధ్యాహ్నానికి తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. సేద తీరుతున్న సమయంలో హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.