రాష్ట్రీయం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 6: తిరుమల శ్రీవేంటేశ్వర స్వామివారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల శోభ తిరుపతిలో కనిపించేలా అలంకరణలు, కటౌట్‌లు, వివిధ దేవతామూర్తులతో కూడిన తోరణాలు, ఆకర్షణీయంగా విద్యుద్దీపాల వెలుగులు కనిపించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని ఈఓ అధికారులను ఆదేశించారు. స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో ఈఒ సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు ఈనెల 20వ తేదీ నాటికి సిద్ధం చేయాలని చెప్పారు. తిరుమలలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సందర్భంగా యాగశాల వద్ద ఏర్పాటు చేస్తున్న ఇంజనీరింగ్ పనులు సౌకర్యవంతంగా ఉండాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలలో తిరుమల, తిరుపతిలో భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను కల్పించాలన్నారు. టీటీడీలో ఐటీ ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మరింత పటిష్టం చేయాలన్నారు. తిరుమలలోని శ్రీవారి సేవకుల సౌకర్యార్థం నిర్మిస్తున్న శ్రీవారి సేవాసదన్ భవనాన్ని బ్రహ్మోత్సవాల ప్రారంభం నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. తిరుమలలోని వివిధ భవనాలకు సంబంధించి అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకునేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కన్యాకుమారి, హైదరాబాద్‌లలో నిర్మిస్తున్న టీటీడీ ఆలయాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. అలిపిరి, గాలిగోపురం మధ్య మొక్కల పెంపకానికి నీటిని సరఫరా చేసేందుకు అవసరమమైన డ్రిప్ ఇరిగేషన్ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఈఓ ఆదేశించారు.