రాష్ట్రీయం

సనాతన ధర్మమే విశ్వానికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: భారతీయ సనాతన ధర్మమే విశ్వానికి మార్గం చూపుతోందని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు. భగవత్ రామానుజుల జీవితంపై హైదరాబాద్ సమీపంలోని దివ్యసాకేత ధామం (శ్రీరామనగరం) జీవా ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన నాలుగురోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో కొంత మంది విగ్రహారాధనను విమర్శిస్తున్నారని చెబుతూ, హిందువులు విగ్రహారాధన చేయడం తరతరాలుగా వస్తోందని, శ్రీరాముడు కూడా విగ్రహారాధన చేశారని గుర్తు చేశారు. కొంత మంది పేరుకోసం, డబ్బుకోసం హిందూమతం, సంప్రదాయాలపై విమర్శలు చేస్తున్నారన్నారు. విషయం తెలియక, ప్రలోభాలకు లోనైనవారే విమర్శలు చేస్తున్నారన్నారు. ఎలాంటి పునాదులు లేకుండా మన ఆచార, వ్యవహారాలను విమర్శిస్తుండటంతో, మన సమాజంలో చాలా మందికి అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు.
వేదాలు, పురాణాలు, సనాతన ధర్మం గురించి తెలిసిన వారు ఎవరూ వీటిని విమర్శించరని అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలమాన పరిస్థితిలో కొత్తగా అనేక సిద్ధాంతాలు వస్తున్నాయని, అన్నింటిలోకి భారతీయ సనాతన ధర్మమే గొప్పదన్నారు. అణుబాంబు కనిపెట్టిన శాస్తవ్రేత్త, దాని ఫలితాలను చూసిన తర్వాత ఈ బాంబు ఎందుకు కనిపెట్టానా అని బాధపడ్డారని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టియన్ మతానికి చెందిన ప్రొఫెసర్ కూడా విగ్రహారాధనను సమర్థించారని, భగవత్ రామానుజుల వారి సిద్ధాంతం సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారన్నారు. అయితే మన దేశానికి చెందిన వారే మన సంప్రదాయాలను విమర్శిస్తున్నారని, దురదృష్టం కొద్దీ మీడియాలో కొన్ని ఛానళ్లు, కొన్ని పత్రికలు ఇలాంటి వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఊదితే దూదిపింజ కొట్టుకుపోయినట్టు, గాలికి గడ్డిపరక ఎగిరిపోయినట్టు సనాతన సంప్రదాయం కొట్టుకుపోదని, ఈ సంప్రదాయం ఎలాంటి ఆటుపోట్లనయినా ఎదుర్కొని స్థిరంగా నిలబడుతుందన్నారు.
వేదాలే ప్రమాణం
వేదాలు, భగవిద్విషయాలు మనకు ప్రమాణంగా ఉన్నాయని అహోబిల జీయర్ పేర్కొన్నారు. ప్రమాణంగా ఉండే శాస్త్రాలను అధ్యయనం చేయడమే మనకు లక్ష్యంగా (ప్రమేయం) ఉండాలని, దేవుడిని చూసిన ఆచార్యులను గౌరవించాలని అన్నారు. ఆచార్యులే మనకు దిక్సూచిగా ఉంటారని వివరించారు. తపస్సు చేసి జ్ఞానం సంపాదించిన ఆచార్యులు తమ జ్ఞానాన్ని సమాజం కోసం వినియోగిస్తున్నారన్నారు. లోకాన్ని ఉద్దరించేందుకే భగవత్ రామానుజులు వెయ్యిసంవత్సరాల క్రితమే పాటుపడ్డారని దేవనాథ్ జీయర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జీవా రీసర్చ్ అండ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.వీ. రంగరామానుజాచార్యులు, జేఆర్‌ఆర్ సంస్కృత విశ్వవిద్యాలయం మాజీ వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ కె.వీ. రామకృష్ణమాచార్యులు, ప్రొఫెసర్ ఎస్. లక్ష్మణ మూర్తి తదితరులు మాట్లాడారు. నాలుగురోజుల సదస్సులో భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు.

చిత్రం..అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ప్రసంగిస్తున్న
త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి