రాష్ట్రీయం

స్తంభించిన రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: మోటార్ వాహనాల చట్టాన్ని సవరించాలని, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్లతో అఖిల భారత మోటారు కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో మంగళవారం ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం నుంచి ఆటోలు, లారీలు తిరగలేదు. విశాఖ నుంచి వివిధ ఆయిల్, గ్యాస్ కంపెనీల పెట్రోలియం ఉత్పత్తులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు.
విశాఖలో సుమారు 1900 ఆయిల్ ట్యాంకర్లు సమ్మెలో పాల్గొనడంతో పెట్రో ఉత్పత్తుల రవాణా నిలిచిపోయింది. ఆటోలు తిరగక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విశాఖలో అక్కడక్కడ కనిపించే రిక్షాలు, ఆటోల బంద్ కారణంగా విశాఖ రోడ్లపై హల్ చెల్ చేశాయి. లారీల బంద్ ప్రభావం నిర్మాణ రంగంపై కనిపించింది. కాగా, ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో ఎన్‌ఎంయూ కార్మికుల సమావేశం మంగళవారం ఇక్కడ జరిగింది. దీంతో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సెలవు పెట్టడంతో, చాలా వరకూ ఆర్టీసీ బస్సులు కూడా తిరగలేదు.
రాజమహేంద్రవరంలో..
రవాణా సమ్మె కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో అనేకచోట్ల ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయ జనజీవనం స్తంభించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన రవాణారంగ సమ్మెలో భాగంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వివిధ సంఘాల కార్మికులు ధర్నా నిర్వహించారు. స్థానిక కంబాలచెరువు సెంటర్‌లో ఆటో, టాక్సీ, లారీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఐఎన్‌టీయూసీ నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్ మూర్తి, టాక్సీ యూనియన్ నాయకుడు ఎం సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రవాణారంగంపై భారాలు మోపి, దానిపై ఆధారపడిన కోట్లాది మంది కార్మికులను రోడ్డుపాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కాకినాడలో నిలిచిపోయిన ఆటోలు
మోటారు వెహికల్ యాక్ట్ సవరణ బిల్లు-17 ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన రవాణా సమ్మెలో భాగంగా కాకినాడలో మంగళవారం ఆటోలు నిలిచిపోయాయి. దీంతో ఆటోలపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

చిత్రాలు..రాజమహేంద్రవరంలో ధర్నా నిర్వహిస్తున్న రవాణా రంగ కార్మికులు
*విశాఖలో నిలిచిపోయిన ఆయిల్ ట్యాంకర్లు