రాష్ట్రీయం

హైదరాబాద్‌లో పోలీస్ ఎమర్జెన్సీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఈనెల 13,14,15వ తేదీల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీగా పోలీసు బలగాలను మొహరింపచేయడానికి పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 13,14వ తేదీల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన, 15న స్వాతంత్య్ర దినోత్సవం కీలకంగా మారాయి. దీనికితోడు మావోలు నగరంలోకి వచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు ఇటీవల ఉగ్రవాదుల కదలికలపై పాత బస్తీలో ఎన్‌ఐఏ తనిఖీలను నిర్వహించింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, హైదరాబాద్‌కు జిల్లాల నుంచి పోలీస్ బలగాలను రప్పిస్తున్నారు. జంటనగరాల్లో తనిఖీలను ముమ్మం చేయాలని, అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని పోలీస్ అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ఒక విధంగా ఎమర్జెన్సీని తలపించే విధంగా పోలీసులు కవాతు చర్యలు చేపడుతోంది. తెలంగాణలో ఉన్న ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత కార్యక్రమాలకు వెళ్ళవద్దని, ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలని అధికారులు సూచిస్తున్నారు. చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో గత సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు మావోలు ప్రతీకార చర్యలకు దిగుతారని, అందుకే ప్రజాప్రతినిధులను బయటికి వెళ్ళవద్దని సూచిస్తున్నారని సమాచారం. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం దండకారణ్యంలో పోలీస్ బలగాలను మోహరించడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మైదానం ప్రాంతలోకి మావోలు ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో తెలంగాణ పోలీస్ స్టేషన్లలో వద్ద పోలీస్ సిబ్బందిని పెంచాలని, తుపాకుల గదివద్ద జవాన్‌లను అప్రమత్తం చేయలన్నారు. ఉస్మానియా క్యాంపస్‌లో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించవద్దని వర్సిటీ విద్యార్థి సంఘాలు బుధవారం హోంమంత్రి నాయిని నరసిహారెడ్డికి వినతి పత్రం అందచేశాయి. ఈ నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 13,14వ తేదీలో హైదరాబాద్ పర్యటనలో ఉస్మానియా వర్సిటీ, పాతబస్తీ, ప్యారడైజ్ ప్రాంతలను సందర్శంచనున్నారు. రెండవ రోజు ఉస్మానియా ఆర్స్ట్ కళాశాల మైదానంలో విద్యార్థులతో ముఖాముఖి చర్చల్లో పాల్గొంటారు. అయితే, ఉస్మానియాలో రాహుల్ పర్యటనను అడ్డుకుంటాలని పలు విద్యార్థుల సంఘాలు హెచ్చరికల నేపథ్యంలో అక్కడ పోలీస్ సోదాలు ముమ్మరం చేయాలని, అలాగే కొత్త వ్యక్తులను ఒయులోకి అనుమతించవద్దని పోలీస్ నిఘా పెంచాలని సూచిస్తున్నారు. ఉస్మానియాలో అనుమానితులను గృహ నిర్భందం లేదా రహస్య ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 27వ తేదీన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు లుంబినీ పార్క, గోకుల్ ఛాట్ వద్ద జంట బాంబు పేలుళ్ల సంఘటనకు బాధ్యులైన నిందితులకు శిక్షలు కోర్టు ఖరారు చేయనుంది. పాతబస్తీలో ఉగ్రవాదుల కదలికలను పసిగట్టడానికి ఐసిఎస్ అనుమానితుల ఇళ్ళపై ఐఎన్‌ఎ సోదాలు ముమ్మరం చేయడంతో పాతబస్తీలో కొంత ఉద్రిక్తత నెలకొందని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.