రాష్ట్రీయం

బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: నేడు దేశంలో, వివిధ రాష్ట్రాల్లో మహిళలు, బాలికలపై జరుగుతున్న దురదృష్టకర సంఘటనలు తెలంగాణలోని వర్శిటీల్లో, కాలేజీల్లో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వైస్ ఛాన్సలర్లకు సూచించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో వైస్ ఛాన్సలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ. పాపిరెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, 15 విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు, మండలి వైస్ ఛైర్మన్లు, రిజిస్ట్రార్లు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన వైస్ ఛాన్సలర్ల సమావేశంలో చర్చించిన విషయాలపై తీసుకున్న చర్యలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. రానున్న ఏడాదికి కార్యాచరణ ప్రణాళిక ఏం రూపొందించారంటూ వీసీలను వాకబు చేశారు. విశ్వవిద్యాలయాల పటిష్టానికి దిశానిర్దేశం చేశారు. విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు ఒకే విధానంలో జరిగేందుకు వీలుగా కామన్ క్యాలండర్ అమలు చేయాలని సూచించారు. అదే విధంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో విద్య నాణ్యత మెరుగుకు బయోమెట్రిక్ మిషన్లను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన కొత్త కోర్సులను అధ్యయనం చేసి వాటిని చేర్చాలని, అవసరం లేని కోర్సులను తీసేయాలని అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, ఇతర విద్యార్థులతో గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసేలా చర్యలు తీసుకోవాలని వీసీలకు సూచించారు. పీహెచ్‌డీ అడ్మిషన్లు, గైడ్ల కేటాయింపు, నిర్ణీత కాలంలో పీహెచ్‌డీ పూర్తి చేయడంపై కూడా ఒకే విధానాన్ని రాష్టమ్రంతా అమలుచేయాలని చెప్పారు. గత ఏడాది అన్ని యూనివర్శిటీలు, అనుబంధ కాలేజీలు, గుర్తింపు పొందిన కాలేజీల్లో బయోమెట్రిక్ మిషన్లు పెట్టాలని నిర్ణయం తీసుకోగా, ఇంకా కొన్ని కాలేజీల్లో వాటి ఏర్పాటు జరగలేదని అన్నారు. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న క్యాంపస్, అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో పూర్తిస్థాయిలో మూడు నెలల వ్యవధిలో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లోని అన్ని సేవలను వేగంగా డిజిటలైజ్ చేయాలని అన్నారు. మహిళా అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని గవర్నర్ సూచించారు. కాగా, వీసీల పనితీరుపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. నేటి వరకూ విశ్వవిద్యాలయాల్లోని వివిధ కార్యక్రమాలు, అభివృద్ధిపై గవర్నర్ పూర్తిస్థాయి సమీక్ష చేశారని కడియం మీడియాకు చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో సేవలను డిజిటలైజ్ చేయడంపై గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. కామన్ క్యాలండర్ అమలుచేయడంపై కూడా సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. గత ఏడాది నుండి అన్ని కాలేజీలు ఒకే సమయంలో అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు ఇచ్చే విధంగా క్యాలండర్‌ను అమలుచేస్తున్నామని కడియం చెప్పారు. పీహెచ్‌డీ అడ్మిషన్లలో గందరగోళం ఉందని, అన్ని వర్శిటీల్లో నెట్, స్లెట్, సెట్ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికే యూజీసీ నిబంధనల మేరకు అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. అదే విధంగా గైడ్స్ సమర్థత కూడా పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ తెలిరని అన్నారు. ఇబ్బడిముబ్బడిగా అడ్మిషన్లు ఇవ్వవద్దని, పీహెచ్‌డీలు కూడా మంచి సబ్జెక్టులపై చేసేలా శ్రద్ధవహించాలని వీసీలకు గవర్నర్ సూచించారని కడియం వివరించారు. దేశంలో రెండోస్థానం, దక్షిణ భారతంలో మొదటిస్థానం సాధించిన వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గవర్నర్ అభినందించినట్టు శ్రీహరి వెల్లడించారు. అదే విధంగా గ్రామీణ వాతావరణం నుండి వచ్చిన తెలుగు మీడియం విద్యార్థులను ఇంజనీర్లు, ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్న బాసర ట్రిపుల్ ఐటీని గవర్నర్ కొనియాడారని అన్నారు. విశ్వవిద్యాలయాలు వాటికి ఉన్న ప్రత్యేకమైన రంగాల్లో సేవలను అవుట్ సో ర్సింగ్ చేయడం వల్ల స్వయంవృద్ధి చెందాలని వీసీలకు సూచించినట్టు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఆరు నెలలకో మారు వీసీల సమావేశం నిర్వహించి విశ్వవిద్యాలయాల ప్రగతిని సమీక్షిస్తారని, ఆరునెలలపై యా క్షన్ రిపోర్టు, భవిష్యత్ కార్యాచరణను వీసీలు ఇవ్వాలని గవర్నర్ పేర్కొన్నట్టు కడియం మీడియాకు చెప్పారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఇతర అధికారులు ప్రస్తుత స్థితిపై గవర్నర్‌కు వివరించారు.