ఆంధ్రప్రదేశ్‌

నేడు సూర్య గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : బుధవారం ఏర్పడుతున్న సూర్యగ్రహణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు భారత్‌లో ఈ గ్రహణం పాక్షికంగానే కనిపిస్తున్నప్పటికీ, దాని ప్రభావం మాత్రం సంపూర్ణసూర్యగ్రహణం స్థాయిలోనే ఉంటుంది. సూర్యోదయం తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో గ్రహణం విడుస్తుంది. హైదరాబాద్‌లో ఉదయం 6.29 గంటల నుండి 6.48 గంటల వరకు, విజయవాడలో 6.19 గంటల నుండి 6.48 గంటల వరకు, విశాఖలో 6.09 గంటల నుండి 6.49 గంటల వరకు, తిరుపతిలో 6.23 నుండి 6.48 వరకు, నిజామాబాద్‌లో 6.30 నుండి 6.48 గంటల వరకు గ్రహణం ఉంటుంది. ప్రముఖ జ్యోతిష్యులు సుబ్రహ్మణ్య సిద్ధాంతి పంచాంగం ప్రకారం ఉభయ రాష్ట్రాల్లో అతి తక్కువగా 17 నిమిషాలు (నిజామాబాద్), అతిఎక్కువ సమయం 41 నిమిషాల 58 సెకన్లు (శ్రీకాకుళం) పాటు గ్రహణం ఉంటుంది. అన్ని ప్రాంతాల్లోనూ గ్రహణం పాక్షికంగానే కనిపిస్తుంది. కాగా, ఇండోనేసియాలోని సుమత్ర, బోర్నియో, సులవేసి దీవులతో పాటు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో మాత్రం ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పూర్తిగా వీక్షించవచ్చు. భారత కాలమానం ప్రకారం ఉదయం 4 గంటల 49 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం 10 గంటల 5 నిమిషాలకు ముగుస్తుంది. ఈ ఏడాది ఇది తొలి సూర్యగ్రహణమని, అంతేకాదు 2019 డిసెంబర్ 26 దాకా భారత్‌లో కనిపించే ఏకైక సూర్యగ్రహణం కూడా ఇదేనని హైదరాబాద్‌లోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎన్ రఘునందన్ చెప్పారు.
నేరుగా చూస్తే ప్రమాదం
సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం వల్ల కంటి చూపు పోయే అవకాశం ఉంటుంది. సూర్యకాంతిలోని అల్ట్రావయోలెట్, ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు కంటి దృష్టికి హాని కలిగిస్తాయని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. స్పెషల్ ఫిల్టర్లను ఉపయోగించి మాత్రమే గ్రహణాన్ని చూడాలని వారు చెబుతున్నారు.
చేయకూడనివి..
గ్రహణం సందర్భంగా నీటిని తాగరాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వంట వండటం, తినడం మంచిది కాదని, గర్భిణులు ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరించారు. గ్రహణం సందర్భంగా ముఖ్యమైన పనులేవీ చేయకూడదని స్పష్టం చేశారు.
చేయాల్సిన పనులు
గ్రహణ సమయంలో నిశ్శబ్దంగా ఉండాలి. గ్రహణానికి ముందు, ఆ తర్వాత తలంటి స్నానం చేయాలి. సూర్యుడికి (ఆదిత్యుడు) సంబంధించిన మంత్రాలు చదువుతూ ఉండాలి.
తిరుపతి సహా ఆలయాల మూసివేత
సూర్యగ్రహణం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలను మూసివేసేందుకు నిర్ణయించారు. దాదాపు అన్ని దేవాలయాలను మంగళవారం రాత్రే మూసివేశారు. బుధవారం సూర్యగ్రహణం తర్వాత శుద్ధి చేసి, సంప్రోక్షణ చేసిన తర్వాత రోజువారీ పూజల అనంతరం భక్తుల దర్శనానికి అవకాశం ఇస్తారు. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం రాత్రి మూసివేశారు. బుధవారం ఉదయం 11.30 తర్వాత భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. సింహాచలం, విజయవాడ, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, అన్నవరం , వేములవాడ, శ్రీశైలం, బాసర, భద్రాచలం, యాదగిరిగుట్ట, అలంపురం, మట్టపల్లి తదితర దేవాలయాలన్నీ మంగళవారం రాత్రే మూసివేశారు. ఈ దేవాలయలన్నీ ఉదయం 11.30 గంటల నుండి 12.30 గంటల మధ్య తిరిగి తెరుస్తామని ఆయా దేవాలయాల ప్రధాన అర్చకులు ప్రకటించారు.