రాష్ట్రీయం

తిరుమలలో గణనీయంగా తగ్గిన రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 10: తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య శుక్రవారం గణనీయంగా తగ్గింది. సర్వసాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 11వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన, బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయం మూసివేస్తామని కొంతకాలం, కొంత మంది భక్తులను అనుమతిస్తామని మరికొంత కాలం, పరిమితి సంఖ్యలో మాత్రమే భక్తులు తిరుమలకు వచ్చి టీటీడీకి సహకరించాలని ఇలా మీడియా ద్వారా భిన్నకథనాలు విన్న నేపథ్యంలో భక్తులు 10న తిరుమలకు రావడానికి ఆసక్తి కనబర్చలేకపోయారు. అయితే అధికారులు ముందుగా ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్న సమయంలో వచ్చిన విమర్శలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలతో ఎక్కువ సంఖ్యలో భక్తులు రావాలని ఆకాంక్షించారు. అయితే పాలకమండలి అధికారుల అవగాహనరాహిత్యంతో చేసిన ప్రకటనలు లక్షల రూపాయలు వెచ్చించి పత్రికలకు ఇచ్చిన ప్రకటనలతో భక్తులు ఆందోళన చెంది పదో తేదీ నాటికే తిరుమల రావడానికి ఆసక్తిచూపలేని పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారిని దర్శించుకోడానికి కేవలం రెండు గంటల సమయం పడుతోంది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే సాధారణ దినాలైన మంగళ, బుధవారాల్లోనే సాయంత్రం 7 గంటల సమయానికి 60 నుంచి 70 మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే లక్ష మంది భక్తులు దర్శించుకునే శుక్రవారం 7 గంటల సమయానికి 39,390 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ నేపథ్యంలో ముందుగా తాము అనుకున్న ప్రకారం ఫలితాలు సాధిస్తున్నామన్న సంతోషంతో అధికారులు ఉన్నా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కువ మంది భక్తులు రాకపోవడంపై అంతర్లీనంగా అధికారులు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా మహాసంప్రోక్షణ కార్యక్రమానికి శనివారం 50 వేల మంది భక్తులు రాకపోతే ఎక్కడ తాము అప్రతిష్ట మోయాల్సివస్తుందోనని టీటీడీ అధికారుల్లో కనిపిస్తోంది.
ఇదిలావుండగా నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆర్టీసీ బస్టాండు భక్తులు లేక ఎక్కడ బస్సులు ఎక్కడ నిలిచిపోయాయి. భిన్న కారణాలతో బంద్‌లు నిర్వహించినప్పుడు కనబడే దృశ్యాలు ప్రతిబింబించాయి. ఏదిఏమైనా మహాసంప్రోక్షణ సందర్భంగా జరుగుతున్న వైదిక కార్యక్రమంలో సామాన్య భక్తులు పాల్గొనలేని పరిస్థితుల రావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చిత్రం..కర్ఫ్యూ కాదు.. బంద్ కాదు.. తిరుమలలో బోసిపోయిన బస్టాండ్