రాష్ట్రీయం

ఆగస్టు 26న ఎస్‌ఐ రాత పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ ఉద్యోగాల నియామకం కోసం ఈ నెల 26వ తేదీన (ఆదివారం) రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ శాఖ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. గత మార్చి 31వ తేదీన సంబంధిత ఎస్‌ఐ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడిన విషయం తెల్సిందే. పరీక్షా కేంద్రాలకు గంట ముందే అభ్యర్థలు చేరుకోవాలన్నారు. ఒక నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. దాదాపు1217 ఎస్‌ఐ ఉద్యోగాల్లో సివిల్‌తో పాటు ఇతరత్రా విభాగాల్లో సమాన ఎస్‌ఐ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని ఆయన చెప్పారు. అభ్యర్థులు హాల్‌టికెట్ కోసం ఆగస్టు 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని, ఒకవేల అభ్యర్థులకు హాల్‌టికెట్స్ రానివారు మొబైల్ ఫోన్ రెంబర్స్ 9393711110,9391005006 అందుబాటులో ఉంటాయన్నారు. అభ్యర్థులు డబ్ల్యూ డబ్ల్యూ,డబ్ల్యూ డాట్ టిఎస్‌ఎల్‌పిఆర్‌బి డాట్ ఇన్‌లో హాల్‌టికెట్లు పొందవచ్చునిని ఆయన చెప్పారు. ఇటీవల తీసుకున్న పాస్‌ఫోర్టుతో పరీక్ష కేంద్రాల్లోకి రావాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్లను రాత పరీక్ష, ఇటర్వ్యూలు చివరిగా ఉద్యోగం చేరేవరకు హాల్‌టికెట్లును ఉంచుకోవాలన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ప్రయాణ ఖర్చులు ఇవ్వడం లేదన్నారు. కేవలం అభ్యర్థులు తమ స్వంత ఖర్చులతో రాత పరీక్షలకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు భద్రపర్చుకోవాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి కమ్యూనికేషన్ పరికరాలను అనుమతిండం లేదన్నారు. అభ్యర్థులు కేవలం నల్ల, బ్లూపెన్ వాడాలని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. పరీక్ష మూడు బాసళ్లలో తెలుగ, ఇంగ్లీస్, హుర్దు ఆమలులో ఉంటుందని ఆయన చేప్పారు.