రాష్ట్రీయం

నేటి నుంచి రైతు బీమా..కంటి వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: రైతులకు పూర్తిగా అండగా నిలిచే రైతు బీమా పథకంతో పాటు ప్రజలందరికీ ఉపయోగపడే కంటి వెలుగు కార్యక్రమం బుధవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. మంగళవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత రైతులు ఎవరు చనిపోయినా, వారి కుటుంబానికి రైతుబీమా కింద ఐదులక్షల రూపాయలు భారతీయ జీవిత బీమా (ఎల్‌ఐసీ) ఇస్తుంది. రైతు బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి-ఎల్‌ఐసీ మధ్య ఇటీవలనే ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో రైతు పేరుతో 2271.50 రూపాయలను ప్రీమియంగా ప్రభుత్వమే చెల్లించింది. ఇందకోసం ప్రభుత్వ ఇటీవలే 600 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అందచేసింది. రైతుపై ప్రీమియం భారం వేయకపోవడం గమనార్హం. మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. దేశంలో ఈ తరహా బీమా ఏర్పాటు కావడం ఇదే మొదటి సారని నిపుణులు పేర్కొంటున్నారు. తాజా లెక్కల ప్రకారం దాదాపు 27 లక్షల మంది రైతులు రైతుబీమా పరిధిలోకి వస్తున్నారు. నియమావళి ప్రకారం 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సున్న రైతులందరూ బీమా పరిధిలోకి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా బీమా గతంలో ఏనాడూ కల్పించలేదు. కేంద్ర ప్రభుత్వం పంటల బీమా తదితర బీమా పథకాలను ప్రకటించినప్పటికీ, వాటికి అనేక షరతులున్నాయి. పంటలు నష్టపోతే చెల్లించాల్సిన బీమాను సంబంధిత బీమా కంపెనీలు ఏదో రకంగా ఎగ్గొంటేందుకే ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఒక వేళ చెల్లించినా ఏడాది తర్వాత తీరిగ్గా పంటల బీమా సొమ్ము చెల్లిస్తున్నారు. అదీ అరకొరగానే రైతులకు అందుతున్నాయి. వీటన్నింటికీ భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు బీమా పథకం అమలు కాబోతోంది. రైతులు ఎవరైనా ప్రమాదవశాత్తు, ప్రకృతివైపరీత్యాలు, సహజమరణం పొందినా బీమా పథకం అమలవుతుంది. రైతు మరణించిన పదిరోజుల్లోగా బీమాసొమ్ము చెల్లించేందుకు ఎల్‌ఐసీ కూడా ముందుకు వచ్చింది. ఇందుకోసం జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని ప్రభుత్వ తాజాగా నియమించింది. బీమా పరిధిలోకి వచ్చే రైతులకు జీవిత బీమా బాండ్లను ఇప్పటికే అందించారు. మిగిలిపోయిన బాండ్లు ఒకటి రెండుజుల్లో అందించేందుకు ఏర్పాట్లు చేశారు. రైతు మరణించిన వెంటనే పూర్తి వివరాలు సంబంధిత వ్యవసాయ అధికారులు ఉన్నతాధికారులకు తెలియచేస్తే సరిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభిస్తున్నారు. దృష్టిలోపంతో బాధపడుతున్న అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కంటివెలుగు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తయాయి. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా 812 వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.