రాష్ట్రీయం

సమీకృత మత్స్య అభివృథ్ధి పథకాన్ని వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మత్య్సకారుల కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చేందుకు చేపట్టిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని మరింత వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణలతో కలిసి వివిధ జిల్లాల మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా లబ్దిదారులను ఎంపిక చేసి వారం రోజుల్లోగా వారి వాటగా చెల్లించాల్సిన మొత్తాన్ని సేకరించాలని సూచించారు. 1,46,739 మంది లబ్ధిదారులకు గాను ఇప్పటి వరకు కేవలం 10,992 మంది వద్ద నుండి మాత్రమే వారి వాటాగా చెల్లించాల్సిన మొత్తాన్న సేకరించినట్టు చెప్పారు. నీటి నిల్వలు ఉన్న చెరువులు, కుంటలలో చేపపిల్లలను విడుదల చేయాలని సూచించారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉన్న చేపపిల్లలను మాత్రమే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. క్వాలిటీ, సైజు తదితర విషయాల్లో రాజీపడకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని పూర్తిగా వీడియోల్లో చిత్రీకరించి ప్రధాన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. పథకంలో అమలులో ఎక్కడా విమర్శలకు తావులేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న చేపల చెరువులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.