రాష్ట్రీయం

ఖమ్మం జిల్లాలో జల ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 20: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి వ్యవస్థ అతలాకుతలమైంది. అటు గోదావరి నది కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూడు రోజులుగా మొదటి ప్రమాద హెచ్చరిక కంటే అధికంగా ప్రవాహం ఉంది. 10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. సోమవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరం నీటిమట్టం 46 అడుగులుగా ఉంది. 48 అడుగులకు నీటిమట్టం చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. శబరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఎగపోటు వేయటంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లోకి నీరు చేరింది. మరోవైపు చర్ల వద్ద ప్రధాన రహదారిపై నీరు చేరటంతో భూపాలపల్లి జిల్లాకు రహదారి సౌకర్యం నిలిచిపోయింది. ములకలపల్లి మండలంలో రోడ్డు కొట్టుకుపోవటంతో భద్రాచలంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్ళపల్లి వద్ద కినె్నరసాని నది వంతెనపై నుండి ప్రవహించటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ప్రాంతంలోనే వాగు దాటబోయిన ఆర్టీసీ బస్సు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంది. చత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులోని తాలిపేరు ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో 25 గేట్లు ఎత్తి లక్షా 66 వేల క్యూసెక్యుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వైరా, పాలేరు, లంక సాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటిమట్టానికి చేరుకుని అలుగుపడ్డాయి. కినె్నరసాని ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో రెండు గేట్లను ఎత్తి గోదావరిలోకి 12 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రెండు జిల్లాల పరిధిలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోవటంతో దాదాపు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం పడమర మెట్ల వద్దకు వర్షపు నీరు చేరటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు బ్రిడ్జి వద్ద రోడ్డు తెగిపోవడంతో ఖమ్మం - రాజమండ్రి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర సరిహద్దు వద్దే పోలీసులు వాహనాలను దారి మళ్ళిస్తున్నారు. అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, కొత్తగూడెం మండలాల్లో ఇళ్ళు కూలిపోయాయి. అయితే ఎటువంటి భారీ ప్రమాదం జరగలేదు. గార్ల మండలం వద్ద బందంవాగు పొంగటంతో ఖమ్మం జిల్లాతో సంబంధాలు తెగిపోయాయి. ఆళ్ళపల్లి మండలంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని పీహెచ్‌సీకి తీసుకు వచ్చేందుకు వెంకట్ అనే వ్యక్తి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును ప్రాణాలొడ్డి దాటాడు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితిని ఇది తెలియజేస్తోంది.
చిత్రాలు..తాలిపేరు గేట్లు ఎత్తేయడంతో నీటి పరవళ్లు
*భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి