తెలంగాణ

సూర్యాపేటలో మాస్‌కాపీయంగ్ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట: ఇంటర్మీడియట్ పరీక్షల్లో అక్రమాలకు అడ్డాగా పేరొందిన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఈ ఏడాది కూడా ఇంటర్ పరీక్షల్లో మాస్‌కాపీయంగ్ జోరుగా సాగుతోంది. పట్టణంలోని కొన్ని పరీక్షా కేంద్రాల నుండి పరీక్ష ప్రారంభమైన కొంతసేపటికే ప్రశ్నలు బయటకు పొక్కుతుండగా పరీక్ష ప్రారంభమైన అరగంటలోనే సంబంధిత సమాధానపత్రాలు పరీక్షా కేంద్రాలకు చేరుతున్నాయి. తాజాగా బుధవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్-1 పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా 9.50 గంటల సమయంలో రోడ్డు పక్కన 50 మార్కులకు సంబంధించిన సమాధాన పత్రాల జిరాక్స్ కాపీలు బయటపడ్డాయి. దీంతో పరీక్షపత్రం లీక్ అయిందన్న ప్రచారం జరగగా అధికారులు మాత్రం పేపర్ లీక్ కాలేదని, సమాధానాలు ఉన్న పత్రాలు మాత్రమే లభ్యమయ్యాయని పలువురు చెబుతున్నారు. పట్టణంలో మొత్తం 14 పరీక్షా కేంద్రాలు ఉండగా ప్రధానంగా రెండు కేంద్రాల నుండి పరీక్ష ప్రారంభమైన కొంతసేపటికే ప్రశ్నలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ కళాశాలల మధ్య పోటీ తీవ్రం కావడంతో ఫలితాల కోసం కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఈ తంతును కొనసాగిస్తున్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. సమాధాన పత్రాలు బయటపడిన విషయం తెలుసుకున్న ఆర్‌ఐవో ప్రకాశ్‌బాబు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు ఆర్‌ఐవో వద్దకు వెళ్లి అక్రమాలపై నిలదీశారు. ఈ విషయంపై ఆర్‌ఐవో మాట్లాడుతూ పరీక్ష పత్రం లీక్ కాలేదని, అయతే, సమాధానాల పత్రాలు బయటకు వచ్చిన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు. ఈమేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.