తెలంగాణ

8 కోట్ల ఎఫ్‌డిలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: రాజధానిలోని ఓ బ్యాంక్‌లో ఘరానా మోసం బయటపడింది. ఇటీవల నగరంలోని ఓ ఆర్టీసి డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్ల ఖాతాల నుంచి లక్షలాది రూపాయలు డ్రా జరిగిన ఘటన మరువక ముందే మల్కాజిగిరిలోని ఓ బ్యాంక్‌లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం మల్లికార్జున నగర్ ఎస్‌బిహెచ్ బ్రాంచిలో రూ. 8.5 కోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఈ మేరకు లిక్విడేటర్ శుక్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. లిక్విడేటర్ అధికారి శుక్లా ఫిర్యాదు మేరకు 420, 468, 470, 170 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత కొంతకాలం నుంచి ముఠాగా ఏర్పడిన కొందరు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి తమ సొంతానికి డబ్బులు డ్రా చేసుకుంటున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు లిక్విడేటర్ శుక్లా పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల అకౌంట్స్‌లో వచ్చిన తేడాతో అనుమానించగా నిధులను వెరిఫికేషన్ చేసుకునే క్రమంలో ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు తక్కువగా ఉన్న విషయం బయటపడిందని తెలిపారు. బ్యాంకు సిబ్బంది పాత్ర లేనిదే ఇంత డబ్బు డ్రా చేసుకునే అవకాశం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నామని మల్కాజ్‌గిరి ఎసిపి రవిచందన్‌రెడ్డి, సిఐ శేఖర్‌గౌడ్, ఎస్‌ఐ జహంగీర్ యాదవ్ తెలిపారు. వివిధ కేసులలో మూతపడిన సంస్థలకు చెందిన 9.56కోట్ల రూపాయల డబ్బులు గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇతర కారణాలతో గత నెల 17న ఆ డబ్బులను మల్కాజిగిరి మల్లిఖార్జుననగర్‌లోని ఎస్‌బిహెచ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఈవిషయాన్ని తెలుసుకున్న కొంత మంది ముఠా సభ్యులు.. నెల రోజుల తర్వాత బ్యాంకుకు వచ్చి మేనేజర్‌తో మాట్లాడి కోర్టుకు సంబంధించిన నకిలీ పత్రాలు చూపించి ఎఫ్‌డి చేసిన డబ్బులలో 8.50కోట్ల రూపాయలు ఇతర ప్రాంతాలలోని 13 బ్యాంకులకు బదిలీ చేసి విత్‌డ్రా చేసుకున్నారు. ఇటీవల హైకోర్టు సహాయ కార్యదర్శి శుక్లా తమ డబ్బుల గురించి బ్యాంక్ మేనేజర్ నీరజను సంప్రదించాడు. డబ్బులను ఇతర అకౌంట్లకు బదిలీ చేయమని మీరే లెటర్ ఇచ్చారని, డబ్బులను ఇతర బ్యాంకులకు బదిలీ చేశామని సమాధానం ఇవ్వడంతో ఆశ్చర్యానికి గురై వెంటనే మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మల్కాజిగిరి పోలీసులు బ్యాంక్ సిబ్బందిని, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి రమణతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు.