తెలంగాణ

జల్సాలకు అలవాటుపడ్డ.. ఏడుగురు దోపిడీ దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సైదాబాద్: చదువుకున్నవారే..కానీ జల్సాలకు అలవాటు పడ్డారు. అందుకు కావలసిన డబ్బుకోసం దోపిడీకి పథకం వేశారు. ఓ ఇల్లును దోచేందుకు యత్నించిన క్రమంలో ఒక మహిళ పాత్ర అవసరమైంది. కాగా వారిలో ఒక ప్రబుద్ధుడు తన తల్లిని రంగంలోకి దింపాడు. దోపిడీ యత్నం బెడిసికొట్టింది. సిసి కెమెరాల ఫుటేజి ఆధారంగా మలక్‌పేట పోలీసులు కేసును ఛేదించారు. దోపిడీ ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సలీంనగర్‌లో నివసించే కుల్‌దీప్ తోష్నివాల్ కుమారుడు ప్రియం తోష్నివాల్ (20) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. విలాస జీవితానికి అలవాటు పడ్డ అతను సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. తమ ఇంటి సమీపంలో నివసించే రతన్‌దేవి తోష్నివాల్ ఇంటిపై కనే్నశాడు. భర్తలేని ఆమె ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు కాగా ఇంటర్ చదివే కొడుకుతో కలిసి ఉంటోంది.
ఆమె వద్ద ఆస్తులు బాగా ఉన్నాయనుకున్న ప్రియం వాళ్ళింట్లో దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. బంధువులైన గోషామహల్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి సౌరభ్ అగర్వాల్ (20), అంబర్‌పేటకు చెందిన మెడికల్ రిప్రంజంటేటివ్ హర్షిత్ శర్మ (29), మిత్రులు జాఫర్ (23), ఫిరోజ్‌ఖాన్ (30), మహమ్మద్ సైఫ్ (19), అతీఖ్ (25)లతో ముఠాగా ఏర్పడ్డాడు. ఎంచుకున్న ఇంటి ప్రధాన ద్వారం తీసేందుకు మహిళ అయితే బాగుంటుదనుకున్నారు. దాంతో సౌరభ్ అగర్వాల్ తన తల్లి రేఖా అగర్వాల్ (41)కు చెప్పి ఒప్పించాడు. ఫిబ్రవరి 29న మధ్యాహ్నం కొడుకు యష్ తోష్నివాల్ స్నానం చేయడానికి బాత్‌రూంకి వెళ్ళగా రతన్‌దేవి హాల్‌లో కూర్చుంది. అప్పుడే వారింటి వద్దకు చేరుకున్న ముఠా రేఖా ఆగర్వాల్ ఇంటి ఐరన్ గ్రిల్స్ నుండి రతన్‌దేవిని పిలిచింది. మొదటి అంతస్తులో ఉండే మీ బంధువు సుశాంత్ పెళ్ళి గురించి ఎంక్వయిరీ చేయాలి తలుపుతీయమంది. నిజమేనని నమ్మిన రతన్ దేవి తలుపు తెరిచింది. హఠాత్తుగా బయట ఉన్న ముఠా సభ్యులు ఇంట్లోకి చొరబడ్డారు.
ముగ్గురు రతన్‌దేవి నోటికి టేప్‌వేసి పట్టుకోగా మిగిలిన వారు బెడ్‌రూంలోకి వెళ్ళి బీరువా తెరువబోయారు. ఈలోపు బాత్‌రూం నుండి బయటకు వచ్చిన రతన్ దేవి కొడుకు యష్ తోష్నివాల్ దుండగులను చూసి కేకలు వేశాడు. దీంతో వారు దోపిడీకి చేసిన ప్రయత్నం విడిచి పారిపోయారు. బాధితుల పిర్యాధులతో మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. బాధితుల ఇంటి సమీపంలోని సిసి కెమెరాలలోని ఫుటేజ్‌తో నిందితులను గుర్తించారు. మహ్మద్ సైఫ్ మినహా మిగిలిన ఏగుడురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.