రాష్ట్రీయం

ఆంధ్రప్రదేశ్‌లోనూ టి.ఎమ్సెట్ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కాకినాడ: ఎమ్సెట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్రం ఇపుడు తెలంగాణ ఎమ్సెట్‌ను ఆంధ్రాలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మే 2వ తేదీన నిర్వహించే తెలంగాణ ఎమ్సెట్‌ను ఆంధ్రాలోనూ నిర్వహించనున్నారు. ఇందుకోసం విశాఖ, తిరుపతి, కర్నూలు, విజయవాడ నగరాలను ఎంపిక చేశారు. భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఎమ్సెట్ పరీక్ష ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
ఈ ఏడాది మే 2న తెలంగాణ రాఅష్ట ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్-2016 రాసే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నాలుగు రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎపి ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబా కాకినాడలో చెప్పారు. విజయవాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నంలలో ఈ రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు ఎపి ఎంసెట్ ప్రక్రియను శరవేగంగా నిర్వహిస్తున్నట్లు సాయిబాబా చెప్పారు. ఇప్పటివరకు ఎపి ఎంసెట్‌కు 2,02,248 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 21వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, తర్వాత అపరాధ రుసుం చెల్లించి ఏప్రిల్ 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఏప్రిల్ 29న ఎపి ఎంసెట్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ, ఆంధ్రా ఎవరికి వారు ఎమ్సెట్ నిర్వహించుకోవడం వల్ల రెండు రాష్ట్రాల విద్యార్థులకూ నష్టం వాటిల్లుతుందని, రెండు రాష్ట్రాలూ పరస్పరం సహకరించుకుంటూ పరీక్ష నిర్వహించడం వల్ల ఉభయపక్షాలకూ లాభసాటిగా ఉంటుందని విశే్లషించిన తర్వాత రెండు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. దాంతో తెలంగాణలో ఆంధ్రా విద్యార్ధులకు హైదరాబాద్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ఇరు రాష్ట్రాల్లో ఎంట్రన్స్ పరీక్ష రాసేందుకు విద్యార్ధులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో నాన్‌లోకల్ కోటాలో విద్యార్థులు సీట్లు పొందే వీలుంది. మంచి కాలేజీల్లో మెరిట్ విద్యార్థులకు సీట్లు వచ్చే అవకాశాలు పెరిగాయని చెబుతున్నారు.