తెలంగాణ

విద్యుత్ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలుకు సీఎం కేసీఆర్ హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం వేతన సవరణను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు శనివారం ప్రకటించారు. సీఎం నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులకు మూలవేతనంలో 35 శాతం పెరగనున్నది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలి విజయం విద్యుత్ ఉద్యోగులకు వర్తించిందని ఆయన అన్నారు. ప్రగతి భవన్‌లో విద్యుత్ శాఖ సీఎండీతో పాటు ఉద్యోగులతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ వరాలు ప్రకటించారు. ఇకనుంచి విద్యుత్ ఉద్యోగులు రెట్టించి పనిచేయాలని ఆయన సూచించారు. జేఎల్‌ఎంలకు సంబంధించిన కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయని, ఈ కేసులు ఉపసంహరించుకుంటే మరో 600 మందికి ఉపశమనం కలుగుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఆరోగ్య పథకాన్ని విద్యుత్ కార్మికులకు కూడా వర్తింపజేస్తామన్నారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే న్యాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంటుందని అన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని, అందుకు నిరంతరం విద్యుత్ అవసరమన్నారు. తెలంగాణ ఏర్పాటు జరిగితే చీకటి అవుతుందని కొందరు శాపనార్థాలు పెట్టారని, అయితే అందుకు భిన్నంగా విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెంచి అవసరాలకు వినియోగించుకుంటున్నామని ఆయన చెప్పారు. వేతన సవరణతో పాటు ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లను ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. జీపీఫ్ అనేది కేంద్ర పరిధిలో ఉన్నదని, వివాదంలో ఉన్న సీపీఎస్‌ను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో 18 సంఘాలకు చెందిన యూనియన్ల నేతలు పాల్గొన్నారు. 1004 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పద్మారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సానుకూలంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వేతన సవరణ గడువు 2018 మార్చి 31వ తేదీతో ముగిసిందన్నారు. వైద్య సౌకర్యం కోసం పరిమితంగా ఉన్న స్లాబ్‌ను ఎత్తివేశారని చెప్పారు. యూనియన్ జనరల్ సెక్రటరీ సాయిబాబా, వైస్ ప్రెసిడెంట్ సుధీర్, అడిషనల్ జనరల్ సెక్రటరీ శంకర్, భానుప్రకాష్, తదతర నేతలు పాల్గొన్నారు. సమావేశం కంటే ముందు వేలాదిమంది విద్యుత్ ఉద్యోగులు ప్రగతి భవన్‌కు ప్రదర్శనగా వెళ్ళారు.