రాష్ట్రీయం

దశాబ్దాలుగా ఇదే తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 1956 నుంచి విభజన జరిగేంతవరకు తెలంగాణలో ఆదాయం ఎక్కువగా ఉండగా, ఆంధ్రలో ఎక్కువ వ్యయం చేశారని సామాజిక ఆర్థిక సర్వే 2016లో పేర్కొన్నారు. సాధారణంగా నష్టాల్లో ఉన్న కంపెనీలు కాయకల్ప చికిత్స తరువాత లాభాల బాట పడుతుంటాయి. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇలాంటి కంపెనీలను స్టాక్ మార్కెట్ పరిభాషలో టర్న్‌డ్ అరౌండ్ కంపెనీలు అంటారు. ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ ఉండడం వల్ల దెబ్బతిన్న తెలంగాణ ఇప్పుడు తన ఆదాయాన్ని తానే వ్యయం చేసుకునే పరిస్థితులు ఉండడంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని టర్న్‌డ్ అరౌండ్ అని సోషియో ఎకనమిక్ ఔట్ లుక్ 2016 పేర్కొంది. తెలంగాణ ఉద్యమకాలంలో అధికారంలో ఉన్న టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణకు పెద్దపీట, తెలంగాణలోనే ఎక్కువ నిధులు వ్యయం చేస్తున్నాం అని చెప్పేవి. కానీ వాస్తవంగా దీనికి భిన్నంగా జరిగింది. తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయం కన్నా వ్యయం తక్కువ చేసి ఆంధ్రలో వచ్చిన ఆదాయం కన్నా అక్కడే ఎక్కువ ఖర్చు చేశారు. 2004-05 నుంచి 2012-13 వరకు 14వ ఆర్థిక సంఘం తెలంగాణలోని పది జిల్లాల వివరాల సేకరించింది. ఆదాయం తెలంగాణలో ఎక్కువ ఉంటే ఖర్చు మాత్రం ఆంధ్రలో ఎక్కువ చేశారని తేల్చారు. ఆర్థిక సంఘం వివరాలు సేకరించిన 2004-05నుంచి 2012-13 వరకు తెలంగాణలోని పది జిల్లాల్లో ఆదాయం 49.5 శాతం అయితే వ్యయం చేసింది మాత్రం 38.5 శాతమే. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్ర, రాయలసీమలో ఈ కాలానికి మొత్తం రాష్ట్ర ఆదాయంలో 50.5శాతం ఈ ప్రాంతం నుంచి ఉంటే ఖర్చు చేసింది మాత్రం 61.5 శాతం. తెలంగాణ నుంచి వచ్చిన అదనపు రెవెన్యూను ఆంధ్రలో ఖర్చు చేశారు. 1956 నుంచి 2014 వరకు ఇలా జరిగినట్టు సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. 1955-57 నుంచి 1967-68 వరకు తెలంగాణలో ఆదాయం 41.7శాతం అయితే వ్యయం మాత్రం 36.8శాతం. ఇక ఆంధ్రలో ఈ కాలానికి ఆదాయం 58.3శాతం అయితే వ్యయం 63.2శాతం చేశారు. 2004-05 నుంచి 2012-13 వరకు తెలంగాణలో ఆదాయం 49.5శాతం అయితే వ్యయం 38.5 శాతం. ఆంధ్రలో ఇదే కాలానికి ఆదాయం 50 శాతం కాగా, వ్యయం 61.5శాతం. 1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో విలీనం చేసిన సంవత్సరం తెలంగాణలో రెవెన్యూ మిగులు ఉండేది. 2014లో తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలి బడ్జెట్‌లో తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా నిలిచింది. ఈ సంవత్సరం కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. దేశంలో గుజరాత్, తెలంగాణ మాత్రమే రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలు. ఈ సంవత్సరం తెలంగాణ రెవెన్యూ మిగులు 3,718 కోట్ల రూపాయలు. తెలంగాణ ఆదాయాన్ని తెలంగాణకు వ్యయం చేయగలుతున్నందువల్లనే సంక్షేమ పథకాలకు, సాగునీటికి భారీగా నిధులు కేటాయించగలుగుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో జాతీయ సగటు వృద్ధి రేటు 8.6శాతం కాగా, తెలంగాణలో మాత్రం 11.7శాతం. 2011-12లో వృద్ధి రేటు 9.2శాతం.