ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర పథకాలకు మోదీ పేరు పెట్టండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాల కింద వేల కోట్ల రూపాయల నిధులు రాష్ట్రాలకు విడుదలవుతున్నాయని, వాటి పేర్లను మార్చి, ప్రభుత్వాలు లబ్దిదారులకు అందిస్తున్నాయని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పలు పథకాల కింద విడుదల చేస్తున్న నిధులకు మోదీ పేరును చేర్చి, లబ్దిదారులకు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనమండలిలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఈ అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేంద్ర విడుదల చేస్తున్న నిధులను లబ్దిదారులకు ఇచ్చేప్పుడు చంద్రబాబు, లేదా ఎన్టీఆర్ పేర్లను చేర్చుతున్నారని, ఇకపై మోదీ పేరుతో ఆయా పథకాలను జనాల్లోకి తీసుకువెళితే బాగుంటుందని అన్నారు. దీనికి మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం ఇస్తూ, మోదీ పేరు చేర్చడానికి తమకు అభ్యంతరం లేదని అన్నారు.
ఆ నిధులు వస్తున్నాయా?
2014-15, 2015-16 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన రెవెన్యూ వనరుల గురించి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సుభాష్ చంద్రబోస్, గోవిందరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి యనమల సమాధానం చెపుతూ 2014-15లో పన్ను రాబడి 29,857 కోట్లు, పనే్నతర రాబడి 8,180.23 కోట్లు, కేంద్ర పన్నులలో వాటా 11,446.16 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్లు 16,210.89 కోట్లు అని పేర్కొన్నారు. అలాగే 2015-16 మార్చి ఎనిమిదవ తేదీ వరకూ పన్ను రాబడి 36,316.26 కోట్లు, పనే్నతర రాబడి 3,774.81 కోట్లు, కేంద్ర పన్నులలో వాటా 19,155.86 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్లు 18,347 కోట్లు అని యనమన పేర్కొన్నారు. దీనిపై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర నుంచి గ్రాంట్ అనుకున్న మేర రావడం లేదని తెలిసిందని అన్నారు. కేంద్రం మంజూరు చేసిన నిధులకు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్ సమర్పించకపోవడం వలన నిధులు రావడం లేదని బిజెపి నాయకులు చెపుతున్నారని అన్నారు. దీనికి కారణం ఏంటని ప్రశ్నించారు. మంత్రి యనమల సమాధానం చెపుతూ యుసిలు పంపించడంలో కాస్తంత ఆలస్యం కావచ్చని, ఏదియేమైనా కొంత అటు ఇటుగా కేంద్ర నిధులు వస్తున్నాయని చెప్పారు.