ఆంధ్రప్రదేశ్‌

రుణ భారంతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట: అప్పుల బాధ తాళలేక చిన్నంబేటి మల్లికార్జున్(56) అనే రైతు తన సొంత పొలంలోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని అన్నమేడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు అన్నమేడు గ్రామంలో మల్లికార్జున్ అనేరైతుకు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇటీవల సుమారు పదిలక్షల రూపాయల వరకు గ్రామంలో చీటీలువేసి వ్యవసాయం సాగిస్తూ అప్పుల పాలైనాడు, ఫ్రస్తుతం తన పంట పొలంలో పండించిన ధాన్యం డబ్బులు కూడా అప్పుల వారికి చాలక పోవడంతో మల్లిఖార్జున్ కలత చెందాడు. ఈ విషయమై తన బంధువర్గంలో గత రెండురోజులుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ నేపద్యంలో కలత చెందిన మల్లికార్జున్ గత రాత్రి ఇంటికి వెళ్లకుండా తన పొలం సమీపంలోని రచ్చబండపై పడుకున్నట్టు స్థానికులు తెలపగా మంగళవారం తెల్లవారేసరికి తన పొలం గట్టుమీద వేప చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు శవాన్ని ఇంటికి తరలించి ఉరేసుకొన్న చెట్టును నరికి వేశారు. జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో ఎస్సై నారాయణ ఘటన స్థలానికి చేరుకొని కేసును విచారించి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని పంచనామాకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.