రాష్ట్రీయం

మీ పని మీరు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవాలని అభ్యర్థులకు టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేసారు. పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీకి ఎంపిక చేసిన అభ్యర్థులతో కేసీఆర్ స్వయంగా ఫోన్లో గురువారం ముఖాముఖిగా మాట్లాడినట్టు పార్టీ వర్గాల సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన నేతలు కొందరు బాహాటంగా తమను ఓడించే లక్ష్యంగా ప్రచారం చేస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ దృష్టికి అభ్యర్థులు తీసుకొచ్చారు. అసమ్మతి నేతల వివరాలన్నీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెప్పించుకున్నానని, వారి సంగతి తనకు వదిలేసి, వారి పని వారు చేసుకోండని అధినేత కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థులలో ఎంఐఎం సిట్టింగ్ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థులను మినహాయించి మిగిలిన వారందరితో కేసీఆర్ స్వయంగా మాట్లాడినట్టు సమాచారం. గురువారం మధ్యాహ్నం నుంచి సాయం త్రం వరకు విరామం లేకుండా అభ్యర్థులు అందరితో కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని, బూత్ కమిటీలకు మంచి కార్యకర్తలను ఎంపిక చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది.
ఎన్నికల ప్రచారం ప్రణాళికాబద్ధంగా జరగాలని, ఏ రోజు ఎక్కడికి వెళ్లేది అంతా టైమ్ టేబుల్ ప్రకారమే జరగాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారితో పాటు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చేరిన నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం చేసుకోవాలన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లాలని, ఎవరినీ విస్మరించవద్దని కేసీఆర్ దిశ నిర్దేశం చేసినట్టు తెలిసింది. బరిలోకి దిగనున్న అభ్యర్థుల వివరాలపై కూడా అధినేత కేసీఆర్ ఆరా తీసినట్టు సమాచారం.