రాష్ట్రీయం

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్రపతి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్రపతి రాజభాషా కీర్తి పురస్కార్ లభించింది. 2017-18 సంవత్సరానికి ఈ అవార్డు లభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా స్టీల్ ప్లాంట్ సీఎండీ రాయ్ చౌదరి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాయ్‌చౌదరి మాట్లాడుతూ ప్లాంట్‌లో కార్మికులంతా చిత్తశుద్ధితో హిందీ బాషను వాడుకలో తీసుకువచ్చినందుకు ఈ అవార్డు లభించిందని అన్నారు. ఈ అవార్డు ప్లాంట్ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ సహాయ మంథ్రి కిరణ్ రిజు, కేంద్ర అధికార భాష కార్యదర్శి శైలేష్, స్టీల్ ప్లాంట్ డైరక్టర్ (పర్సనల్) కేసీ దాస్ తదితరులు పాల్గొన్నారు.