రాష్ట్రీయం

మోదీ కన్నా నేనే సీనియర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ తనకన్నా సీనియర్ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నమ్మించి, నట్టేట ముంచారని బీజీపీ తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రావాల్సినవి ముక్కుపిండి మరీ వసూలు చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా వర్సిటీ పరిధిలో జ్ఞానభేరి కార్యక్రమాన్ని విజయవాడలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో 19 అంశాలను పొందుపరిచారని, భావితరాలకోసం కేంద్రంతో కలిశామన్నారు. వేంకటేశ్వరని సాక్షిగా నమ్మబలికి నట్టేట ముంచారని ఆరోపించారు. ప్రధాని మోదీ తనకేమీ సీనియర్ ఏం కాదని వ్యాఖ్యానించారు. తాను 1995లోనే సీఎం అయ్యాయని, ఆయన 2002లో అయ్యారని తెలిపారు. 1977 నుంచి రాజకీయాల్లో ఉన్నానన్నారు. ఆయనకు అవకాశం వచ్చిందని, తాము సహకరించామన్నారు. కేంద్రం సహకరించకున్నా, రెండంకెల వృద్ధి రేటు సాధించామన్నారు. కేంద్రం సహకరించి ఉంటే ఇన్ని ఇబ్బందులు తప్పేవన్నారు. ఎన్డీయే, మోదీ న్యాయం చేయకపోవడం వల్ల పోరాడుతున్నామని, ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. వడ్డీతోసహా వసూలు చేసేంతవరకూ పోరాటం ఆపమని హెచ్చరించారు. కొంతమంది మనల్ని విమర్శిస్తూ, రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటున్నారని, మోదీ కానీ, ఎన్డీయే కానీ తనను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. సహాయ నిరాకరణ
ద్వారా ఇబ్బందుల పాలు చేస్తున్నారని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు పెట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. 15వ ఆర్థిక సంఘం పేరుతో రాష్ట్రాన్ని ఇబ్బందులపాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపును వ్యతిరేకిస్తున్నామన్నారు. జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన నిధులు ఇస్తామంటున్నారని, ఇది ఎలా న్యాయమని ప్రశ్నించారు. 1971నాటి జనాభాను ప్రాతిపదికగా తీసుకోకపోతే, అన్యాయం జరుగుతుందన్నారు. అనేక సమస్యలు సృష్టిస్తున్నా, కష్టాన్ని నమ్ముకున్న తనను ఏమీ చేయలేరన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ఏ ప్రాజెక్టు ఇంత వేగంగా జరగటం లేదన్నారు. కొంతమంది పెద్దమనుషులు బాధ్యత లేకుండా విమర్శిస్తున్నారన్నారు. ప్రాజెక్టుకు 58వేల కోట్ల రూపాయలు అవసరమని, ఇచ్చి తీరాలని, కేంద్రంతో తేల్చుకుంటామన్నారు. రూ.2800కోట్లు విడుదల చేయాల్సి ఉందని, ఆ డబ్బులు విడుదల చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. మోదీ మనసులో ఏదో పెట్టుకుని, గుజరాత్‌ను మించిపోతామనే దురుద్దేశంతోనే రాష్ట్రానికి సహకరించడం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్‌ను అధిగమిస్తామని, చరిత్ర తిరగరాస్తామని స్పష్టం చేశారు. నోట్ల రద్దు ఒక ప్రహసనంలా మిగిలిందని, ఏటీఎంలో డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్నారు. కక్ష కట్టి ఏపీకి అన్యాయం చేస్తున్నారన్నారు. వైకాపా నేత జగన్ నిలదీయాల్సిన వారిని నిలదీయకుండా, తనను తిడుతున్నారని ఆరోపించారు. సెల్ఫీలు తీసుకుంటూ వెళ్తున్నారని, అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. ఇటువంటి వారివల్ల ఏమి ఉపయోగమని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరోసారి టీడీపీ ప్రభుత్వం రావడం చారిత్రక అవసరమని స్పష్టం చేశారు.